AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sweet Bonda: దూదిలాంటి గోధుమపిండి తీపి బోండాలు.. పిల్లలకు ఇష్టమైన ఈవెనింగ్ స్నాక్

సాయంత్రం స్కూల్ నుంచి వచ్చే పిల్లలకు లేదా ఇంట్లో పెద్దవారికి అప్పటికప్పుడు వేడివేడిగా తియ్యటి స్నాక్స్ చేసి పెట్టాలనుకున్నప్పుడు గుర్తొచ్చే బెస్ట్ రెసిపీ 'గోధుమపిండి తీపి బోండాలు'. సాధారణంగా స్వీట్లు చేయాలంటే పాకం పట్టడం, పిండి నానబెట్టడం వంటి ఎంతో సమయం తీసుకునే పనులు ఉంటాయి. కానీ ఈ తీపి బోండాలకు ఎలాంటి పాకం పట్టాల్సిన అవసరం లేదు అలాగని మైదా పిండి గానీ పంచదార గానీ వాడనక్కర్లేదు . కేవలం స్వచ్ఛమైన బెల్లం నీళ్లు, గోధుమపిండి, చిటికెడు వంటసోడా లేదా బేకింగ్ పౌడర్ కలయికతో పది నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. 

Phani CH
|

Updated on: Oct 02, 2026 | 8:55 PM

Share
కావలసిన పదార్థాలు: 1 కప్పు గోధుమపిండి, ముప్పావు కప్పు తురిమిన బెల్లం, అర కప్పు బెల్లం కరిగించడానికి నీళ్లు,  2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, అర టీస్పూన్ యాలకుల పొడి, చిటికెడు ఉప్పు, పావు టీస్పూన్ బేకింగ్ పౌడర్, అర టీస్పూన్ నెయ్యి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె 

1 / 5
తయారీ విధానం: ఒక చిన్న పాత్రలో ముప్పావు కప్పు తురిమిన బెల్లం, అర కప్పు నీళ్లు పోసి స్టవ్‌పై పెట్టాలి. పాకం పట్టాల్సిన పనిలేదు; బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేసి, ఇసుక లేదా నలకలు లేకుండా స్ట్రైనర్‌తో ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్‌లోకి వడకట్టుకుని గోరువెచ్చగా చల్లారనివ్వాలి.

2 / 5
గోరువెచ్చని బెల్లం నీటిలో ఒక కప్పు గోధుమపిండి, రెండు చెంచాల బొంబాయి రవ్వ, యాలకుల పొడి, చిటికెడు ఉప్పు, పావు టీస్పూన్ బేకింగ్ పౌడర్ లేదా వంట సోడా మరియు అర టీస్పూన్ నెయ్యి వేయాలి. పిండిని ఉండలు ఏమీ లేకుండా చేత్తో లేదా విస్కర్ సహాయంతో పునుగుల పిండిలాగా మైసూర్ బోండా పిండి కన్సిస్టెన్సీలో బాగా కలపాలి. పిండి మరీ జారుడుగా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు; చేత్తో వేస్తే గుండ్రంగా పడేలా ఉండాలి. పిండిని 5 నిమిషాల పాటు చేత్తో బాగా బీట్ చేస్తూ కలిపితే బోండాలు నూనె పీల్చకుండా గుల్లగా పొంగుతాయి.

3 / 5
బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. ఇప్పుడు చేతి వేళ్లను కొద్దిగా నీటిలో తడుపుకుని చిన్న చిన్న ముద్దలుగా పిండిని తీసుకుని కాగిన నూనెలో నెమ్మదిగా వేయాలి. బోండాలు వేసిన వెంటనే గరిటె పెట్టకూడదు. కాసేపటికి అవే పైకి తేలతాయి.

4 / 5
ఆ తర్వాత గరిటెతో అటూ ఇటూ తిప్పుతూ సమానంగా అన్ని వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు మీడియం మంటపై వేయించాలి. హై ఫ్లేమ్‌పై వేయిస్తే పైన రంగు వచ్చేసి లోపల పిండి ఉడకదు, లో-మీడియం ఫ్లేమ్ అయితేనే సమానంగా వేగుతాయి. మంచి బంగారు రంగు రాగానే జాలి గరిటెతో నూనె వడగట్టి టిష్యూ ఉన్న ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే, నోరూరించే గోధుమపిండి తీపి బోండాలు సిద్ధం! వేడివేడిగా తింటుంటే పైన లేత క్రిస్పీనెస్, లోపల పంచదార లేని కమ్మనైన బెల్లం తీపితో ప్రతి ముక్కా ఎంతో రుచిగా ఉంటుంది

5 / 5
Follow Us