సూర్యాపేట గౌతమ్ మిస్సింగ్ మిస్టరీ.. కేసును ఛేదించిన పోలీసులు..బాలుడు సేఫ్ !

| Edited By: Ram Naramaneni

Nov 19, 2020 | 2:06 PM

సూర్యాపేటలో బాలుడి అదృశ్యం కలకలం రేపుతోంది. దీపావళి టపాకాయలు కోసం బయటికి వెళ్లిన ఐదేళ్ల బాలుడు గౌతమ్ ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో..

సూర్యాపేట గౌతమ్ మిస్సింగ్ మిస్టరీ.. కేసును ఛేదించిన పోలీసులు..బాలుడు సేఫ్ !

సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి కిడ్నాప్ కు గురైన బాలుడు గౌతమ్‌ను పోలీసులు క్షేమంగా అతని తల్లిదండ్రులకు అప్పగించడంతో .. కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్‌కు గురైన 24గంటల్లోనే బాలుని ఆచూకీ కనుగొని తల్లి ఒడికి చేర్చారు పోలీసులు. సూర్యాపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్‌లో నివాసముంటున్న మహేష్, నాగలక్ష్మిల కొడుకు మహేష్ శనివారం సాయంత్రం కిడ్నాప్‌కు గురైన సంగతి తెలిసిందే. పండగ సందర్భంగా శనివారం సాయంత్రం పటాకులు కాల్చేందుకు గాను.. అగ్గిపెట్టె కొనేందుకు పక్కనే ఉన్న కిరాణా షాపునకు వెళ్ళిన గౌతమ్ అక్కడే కిడ్నాప్‌కు గురయ్యాడు. ఆదివారం మధ్యాహ్నం బాలుడు గౌతమ్ ఇంటి వెనక ఉన్న టైలర్ ఇంటికి ఫోన్ చేసి బాబు గురించి వాకబు చేశారు కిడ్నాపర్లు. తాము కర్నూలులో ఉన్నట్లు చెప్పారు. దీంతో విషయం తెలిసిన పోలీసులు ఆ నెంబర్‌ను వెరిఫై చేయడంతో బాలుని ఆచూకీ లభించింది.

ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన ముగ్గురు యువకులు ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ బాస్కరన్ తెలిపారు. పూర్తిగా సినీ ఫక్కీ లో జరిగిన ఈ సంఘటనపై ఎస్పీ బాస్కరన్ తెలిపిన వివరాల ప్రకారం… ముగ్గురు నిందితులు.. శనివారం సాయంత్రం కిడ్నాప్ చేసి మిర్యాలగూడ వెళ్లారు… ఆ మర్నాడు అక్కడినుంచి వారిలో ఒక వ్యక్తి గౌతమ్‌ను తీసుకొని హైదరాబాద్ వెళ్ళాడు. మిగిలిన ఇద్దరు మిర్యాలగూడలో ఉంటు గౌతమ్ తండ్రి మహేష్‌కి ఫోన్ చేస్తూ పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే నిందితులు తమ ఫోన్‌లు కాకుండా రోడ్డుపై వెళ్లే వారి ఫోన్‌లు తీసుకొని మహేష్‌కు ఫోన్ చేసి ఆ తరువాత ఆనంబర్ బ్లాక్‌లో పెట్టి ఎలాంటి ఆధారాలు దొరకకుండా చేశారు. ఇక పోలీసుల సూచనతో 7 లక్షలు ఇస్తానని ఒప్పుకున్న మహేష్‌కు కిడ్నాపర్లు.. తమ సొంత ఫోన్‌తో మిస్డ్ కాల్ ఇచ్చారు. ఈ చిన్న తప్పే  కిడ్నాపర్లను పట్టించిందని ఎస్పీ భాస్కరం తెలిపారు. ఆతరువాత మిర్యాలగూడలోనే గౌతమ్‌ను రెస్క్యూ చేశామని ఎస్పీ తెలిపారు. అనంతరం నిందితుల ఫోన్ నెంబర్ ఆధారంగా వారిని గుర్తించి మాచర్లలో అరెస్ట్ చేశామని అన్నారు. కిడ్నాపర్లలో ఇద్దరు మైనర్లు కాగా ఒక వ్యక్తి ఉన్నట్లు తెలిపారు. కేవలం డబ్బుల కోసమే ఈ కిడ్నాప్ జరిగిందని అన్నారు. ఇక కిడ్నాప్‌కు గురైన తన కొడుకు తనకి దక్కడంతో బాలుని తల్లి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Nov 2020 06:24 PM (IST)

    గౌతమ్ మిస్సింగ్ మిస్టరీ.. ఆ ఫోన్ కాల్ ట్రేస్ కాలేదా.? ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

    టైలర్ షాపుకు ఆగంతకుడి నుంచి వచ్చిన కాల్ డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. దానిని ఆధారంగా చేసుకుని పోలీసులు ఈ కేసును చేధించే క్రమంలో ఉన్నారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి వివరాల విషయంలో పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. ఆగంతకులు ఎలాంటి క్లూ తెలియకుండా ఉండేలా పోలీసులు పకడ్బందీగా దర్యాప్తు చేస్తున్నారు. గౌతమ్ తండ్రిని వెంటపెట్టుకుని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు మాత్రం బయటికి రానివ్వట్లేదు. 24 గంటలు గడుస్తున్నా.. గౌతమ్ ఇంటికి చేరకపోయేసరికి వాళ్ళ ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఒకదశలో సృహ తప్పిపడిపోయింది. కాగా, పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ భాస్కర్ నాలుగు టీంలను ఏర్పాటు చేశారు. ఆగంతుకుడి కాల్ ట్రేస్ చేయడమే కాకుండా.. బాలుడి తల్లిదండ్రుల కాల్ డేటాను కూడా సేకరించి ఎవరైనా పాత కక్షలతో గౌతమ్‌ను కిడ్నాప్ చేసారా.? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక కిడ్నాప్ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి కాల్ రాలేదని తెలుస్తోంది.

  • 15 Nov 2020 06:23 PM (IST)

    ఇంకా ట్రేస్ కాని దుండగుడి ఫోన్ కాల్.. ఆందోళనలో తల్లిదండ్రులు.. గంటలు గడిచే కొద్దీ టెన్షన్.. 22 గంటలు పూర్తయిన దొరకని గౌతమ్ ఆచూకీ.!

    సూర్యాపేట బాలుడు అదృశ్యం కేసులో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గౌతమ్ నివాసం వెనుక ఉన్న లేడీస్ టైలర్ షాపుకు దుండగుడి నుంచి ఫోన్ కాల్ రావడంతో పోలీసులు ఆ కాల్ ఎక్కడ నుంచి వచ్చింది.? సిమ్ ఎవరదన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.? అంతేకాకుండా గత రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బైకులపై తిరిగారని స్థానికులు చెబుతుండటంతో.. వాళ్లు ఎవరన్న అంశంపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. ఎక్కడా కూడా వివరాలు బయటికి రాకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు.


  • 15 Nov 2020 06:22 PM (IST)

    బాలుడి అదృశ్యం: పోలీసులకు దొరికిన లీడ్.. లేడీ టైలర్ షాపుకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్..

    సూర్యాపేట బాలుడి అదృశ్యం కేసులో పోలీసులకు లీడ్ దొరికింది. బాలుడు నివాసం వెనుక బజారులో ఉన్న లేడీ టైలర్ షాపుకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ”మీ ప్రాంతంలో తప్పిపోయిన బాలుడు.. తమ దగ్గరే ఉన్నదంటూ” ఆ దుండగుడు సమాచారం ఇచ్చాడు. అతని మాటలపై అనుమానం రావడంతో.. టైలర్ పోలీసులకు సమాచారం అందించారు. ‘అసలు ఆ ఫోన్ కాల్ ఎక్కడ నుంచి వచ్చింది.? సిమ్ కార్డు ఎవరి పేరు మీద ఉంది.? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

     

  • 15 Nov 2020 03:35 PM (IST)

    తెలంగాణలో వరుసగా మిస్సింగ్ మిస్టరీస్.. పోలీసులకు విసురుతున్న ఛాలెంజ్‌.. అసలు వాళ్లంతా ఏమయ్యారు.!

    తెలంగాణ రాష్ట్రంలో మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. మొన్న నాగర్‌కర్నూలు.. ఆ తర్వాత కొమురం భీం జిల్లా.. ఇప్పుడు సూర్యాపేట.. ఒక్కొక్కరిగా మాయమవుతున్నారు. ఎక్కడున్నారో తెలియదు. ఏమవుతున్నారో తెలియదు. ఈ మిస్సింగ్ మిస్టరీ కేసులు పోలీసులకు మిస్టరీగా మారుతున్నాయి.

    హరీష్ శంకర్ అనే వ్యక్తి తన ఇద్దరి పిల్లలతో ఆత్మహత్య చేసుకుంటున్నానని.. సెల్ఫీ వీడియో పెట్టి ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. ఇక నెక్స్ట్ ఓ కానిస్టేబుల్ కూడా కనిపించకుండా పోయాడు. ఇప్పుడు ఐదేళ్ల బాలుడు మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ ముగ్గురిది వేరు వేరు జిల్లాలైన అందరివి మిస్సింగ్ కేసులే. ఇక ఇప్పుడే ఇదే కలకలం రేపుతోంది.

Follow us on