హైదరాబాద్ మెట్రో… ఆ ఐదు స్టేషన్లు బంద్..!

|

Sep 04, 2020 | 2:48 PM

సెప్టెంబర్ 7వ తేదీ నుంచి హైదరాబాద్ మెట్రో సర్వీసులు దశల వారీగా ప్రారంభం కానున్నాయి. మొదటిగా 7న మియాపూర్- ఎల్‌బీ నగర్, ఆ తర్వాత 8న నాగోల్- రాయదుర్గం, 9న ఎంజీబీఎస్- జేబీఎస్ రూట్లు ప్రారంభమవుతాయి.

హైదరాబాద్ మెట్రో... ఆ ఐదు స్టేషన్లు బంద్..!
Follow us on

Hyderabad Metro Stations: సెప్టెంబర్ 7వ తేదీ నుంచి హైదరాబాద్ మెట్రో సర్వీసులు దశల వారీగా ప్రారంభం కానున్నాయి. మొదటిగా 7న మియాపూర్- ఎల్‌బీ నగర్, ఆ తర్వాత 8న నాగోల్- రాయదుర్గం, 9న ఎంజీబీఎస్- జేబీఎస్ రూట్లు ప్రారంభమవుతాయి. ఇక తొలి రెండు రోజులు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు తిరగనుండగా.. ఆ తర్వాత 9వ తేదీ నుంచి ఉదయం 7 గంటల – రాత్రి 9 గంటల వరకు మెట్రో సర్వీసులు తిరగనున్నాయి.

మెట్రో ట్రైన్లలలో మాస్కులు తప్పనిసరి కాగా.. ప్రయాణీకులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోనున్నారు. అటు కరోనా లక్షణాలు లేనివారికే మెట్రో ప్రయాణాలకు అనుమతులు ఇవ్వనున్నారు. కాగా, కంటైన్మెంట్ జోన్లలో ఉన్న గాంధీ హాస్పిటల్, భరత్ నగర్, మూసాపేట్, ముషీరాబాద్, యూసఫ్‌గూడ స్టేషన్లను మూసి వేయనున్నారు.

Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..