
హర్యానాలో బుధవారం బ్యాంక్ దోపిడీ జరిగింది. ఐదుగురు వ్యక్తులు గన్‌లతో వచ్చి.. బ్యాంకును లూటీ చేశారు. జజ్జర్ జిల్లాలోని మచ్రౌలి గ్రామంలోని ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి ఆయుదాలతో ప్రవేశించిన దుండగులు బ్యాంకు అధికారుల్ని బెదిరించి.. ఏడు లక్షలు ఎత్తుకెళ్లారు. బ్యాంకు సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్నతుపాకీని కూడా లాక్కున్నారు.
ఈ దోపిడి గురించి స్థానిక పోలీసు సూపరింటెండెంట్ హిమాన్షు గార్గ్ మాట్లాడుతూ “మా వద్ద సీసీ టీవీ ఫుటేజ్ ఉంది. కానీ దుండగులు ముసుగులు ధరించారు. మేము కేసుపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాము. సుమారు రూ .7 లక్షలు దోచుకున్నారు. ఇద్దరు డిఎస్పి ర్యాంక్ అధికారులు ఈ కేసును పరిశీలిస్తున్నారు. నేను కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాను. ” అని పేర్కొన్నారు. నేరస్థులను త్వరలోనే అరెస్టు చేయడంతో పాటు దోపిడీ చేసిన నగదును తిరిగి బ్యాంకుకు అందజేస్తామని ఆయన తెలిపారు.
( “వాడి పొగరు ఎగిరే జెండా”, అంచనాలకు మించిన తారక్ టీజర్ )