కరోనాతో పెంపుడు కుక్క మృతి..!

| Edited By:

Jul 31, 2020 | 7:49 PM

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో యూఎస్ లోని న్యూయార్క్ నగరంలో మొట్టమొదటిసారి ఓ పెంపుడు కుక్క కరోనాతో మరణించింది. జర్మన్ షెఫెర్డ్ జాతికి చెందిన పెంపుడు శునకం

కరోనాతో పెంపుడు కుక్క మృతి..!
Follow us on

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో యూఎస్ లోని న్యూయార్క్ నగరంలో మొట్టమొదటిసారి ఓ పెంపుడు కుక్క కరోనాతో మరణించింది. జర్మన్ షెఫెర్డ్ జాతికి చెందిన పెంపుడు శునకం మరణించిందని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకటించింది. ఏడేళ్ల వయసున్న బుడ్డీ అనే పెంపుడు శునకానికి ఏప్రిల్ నెలలో శ్వాస కోస సమస్యతో బాధపడింది. బుడ్డీ శునకానికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది.

బ్రీతింగ్ సమస్యతో ముక్కు మూసుకుపోవడంతో బుడ్డీ శునకం రక్తపు వాంతులు చేసుకొని మరణించిందని మహోనీస్ చెప్పారు. పెంపుడు కుక్క కళేబరాన్ని ఖననం చేశారు. అమెరికాలో ఇప్పటివరకు 12 కుక్కలు, 10 పిల్లులు, ఓ పులి, సింహం కరోనా బారిన పడ్డాయని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వివరించింది.

Read More:

నర్సులకు భారీ ఆఫర్లు.. విమానచార్జీలు.. 50 వేల జీతం..!

ఇంటర్ సెకండియర్‌ విద్యార్థులందరూ పాస్‌.. అందుబాటులో మెమోలు..!