విశాఖ యుద్దనౌకలో అగ్నిప్రమాదం.. కార్మికుడు మృతి

ముంబైలోని మజ్‌గావ్‌ నౌకా నిర్మాణ స్థావరంలో నిర్మాణంలో ఉన్న విశాఖపట్నం యుద్ధనౌకలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందగా.. మరో కార్మికుడు గాయపడినట్లు అధికారులు చెప్పారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని మజ్ గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఊపిరాడకపోవడం, శరీరం కాలడంతో బజేంద్ర కుమార్ మృతి చెందాడని తెలిపింది. గాయాలపాలైన మరో కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. మొత్తం ఎనిమిది […]

విశాఖ యుద్దనౌకలో అగ్నిప్రమాదం.. కార్మికుడు మృతి

Edited By:

Updated on: Jun 22, 2019 | 10:09 AM

ముంబైలోని మజ్‌గావ్‌ నౌకా నిర్మాణ స్థావరంలో నిర్మాణంలో ఉన్న విశాఖపట్నం యుద్ధనౌకలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందగా.. మరో కార్మికుడు గాయపడినట్లు అధికారులు చెప్పారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని మజ్ గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఊపిరాడకపోవడం, శరీరం కాలడంతో బజేంద్ర కుమార్ మృతి చెందాడని తెలిపింది. గాయాలపాలైన మరో కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. మొత్తం ఎనిమిది అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేశారు. యుద్ధనౌకలోని రెండు, మూడు అంతస్థులకు మంటలు వ్యాపించాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. విచారణ జరిపి వాస్తవాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.