మేఘమలై కొండల్లో అగ్నిప్రమాదం

| Edited By:

Mar 08, 2019 | 12:38 PM

తమిళనాడు ముదుమలై అటవీ ప్రాంతంలోని మేఘమలై కొండల్లో అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. దాదాపు 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవి అగ్నికి ఆహుతవుతుంది. ఆ ప్రాంతంలోని వన్యప్రాణుల పరిస్థితి దయనీయంగా ఉంది. బలమైన గాలులు వీస్తుండటంతో మంటలు ఆర్పేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పది రోజుల కిందట కూడా ముదుములై టైగర్‌ రిజర్వ్‌లో మంటలు చెలరేగగా 50 ఎకరాల అటవీ ప్రాంతం దగ్దమయింది. ఈ మంటలను […]

మేఘమలై కొండల్లో అగ్నిప్రమాదం
Follow us on

తమిళనాడు ముదుమలై అటవీ ప్రాంతంలోని మేఘమలై కొండల్లో అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. దాదాపు 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవి అగ్నికి ఆహుతవుతుంది. ఆ ప్రాంతంలోని వన్యప్రాణుల పరిస్థితి దయనీయంగా ఉంది. బలమైన గాలులు వీస్తుండటంతో మంటలు ఆర్పేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పది రోజుల కిందట కూడా ముదుములై టైగర్‌ రిజర్వ్‌లో మంటలు చెలరేగగా 50 ఎకరాల అటవీ ప్రాంతం దగ్దమయింది. ఈ మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది, అటవీ అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.