తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విరుద్‌నగర్ జిల్లా ముత్తాలపురంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఒ వైపు భారీ శబ్దాలు, అగ్రికీలలు స్థానికులను బెంబేలెత్తించాయి. మంటల్లో చిక్కుకున్న వారిలో ఒకరు చనిపోగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మూడు గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో విధులు ఐదు మంది సిబ్బంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కంపెనీ యాజమాన్యం సేఫ్టీ మెజర్‌మెంట్ తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.