దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సౌత్ వెస్ట్ ఢిల్లీలో ఉన్న నరైనా పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుంది. దట్టమైన పొగలతో కూడిన మంటలు వస్తుండటంతో.. వాటిని అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది చాలాసేపు శ్రమించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.