మహారాష్ట్రలో 891కి చేరిన కరోనా కేసులు.. 150మంది తబ్లిగీలపై కేసు నమోదు..!

| Edited By:

Apr 07, 2020 | 3:56 PM

కోవిద్ 19 దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమయ్యాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా వైరస్‌ తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా నిజాముద్దీన్‌ ఘటన అనంతరం

మహారాష్ట్రలో 891కి చేరిన కరోనా కేసులు.. 150మంది తబ్లిగీలపై కేసు నమోదు..!
Follow us on

కోవిద్ 19 దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమయ్యాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా వైరస్‌ తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా నిజాముద్దీన్‌ ఘటన అనంతరం రాష్ట్రంలో వైరస్‌ తీవ్రత మరింత పెరిగింది. తాజాగా రాష్ట్రంలో 23కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 891కి చేరింది. గడచిన 24గంటల్లో రాష్ట్రంలో 110 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అత్యంత జనసాంద్రత ఉండే ధారావి ప్రాంతంలో నమోదవుతున్న కేసుల సంఖ్య కలవరపెడుతోంది.

కోవిద్ 19 వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. ధారావిలో తొలుత వైరస్‌ సోకి మరణించిన వ్యక్తినుంచి అతని తండ్రి, సోదరునికి కరోనా సోకినట్లు అధికారులు తాజాగా గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం వీరిద్దరికి సన్నిహితంగా మెలిగిన వారందరినీ గుర్తించే పనిలోపడ్డారు. ఇప్పటికే ధారావి ప్రాంతంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7కు చేరుకుంది. ఈ సందర్భంలో నిజాముద్దీన్‌ నుంచి వచ్చిన 10మంది తబ్లిగీ సభ్యులు ధారావిలో కొన్నిరోజులపాటు గడిపినట్లు పోలీసులు గుర్తించారు.

కాగా.. ధారావిలో కరోనాతో మరణించిన తొలివ్యక్తి ఇంటిలోనే వీరు ఉన్నట్లు కనుగొన్నారు. నిజాముద్దీన్‌ నుంచి వచ్చిన ఈ పదిమంది నుంచే ధారావి ప్రాంత వ్యక్తికి కరోనా సోకినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేరళకు చెందిన వీరంతా నిజాముద్దీన్‌ నుంచి ధారావి చేరుకొని అక్కడ నుంచి మళ్లీ కేరళకు బయలుదేరినట్లు పేర్కొన్నారు. అయితే వీరికి కొవిడ్‌ ఉన్నదా? లేదా? అనే విషయాన్ని కేరళ అధికారులే ధృవీకరించాలని ముంబయి పోలీసులు పేర్కొన్నారు.