జేసీ దివాకర్ రెడ్డికి మైనింగ్ అధికారుల షాక్… రూ. 100 కోట్లు జరిమానా..!

జేసీ దివాకర్‌రెడ్డికి ఊహించని షాక్‌. ఒకటీ.. రెండూ కాదు.. ఏకంగా వందకోట్ల జరిమానా.. !

జేసీ దివాకర్ రెడ్డికి మైనింగ్ అధికారుల షాక్...  రూ. 100 కోట్లు జరిమానా..!
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 01, 2020 | 9:52 AM

జేసీ దివాకర్‌రెడ్డికి ఊహించని షాక్‌. ఒకటీ.. రెండూ కాదు.. ఏకంగా వందకోట్ల జరిమానా.. ! త్రిశూల్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని చెబుతూ ఏపీ మైనింగ్ డిపార్ట్‌మెంట్‌ ఆ మేరకు 100 కోట్లు జరిమానా విధించింది. ఒక వేళ దాన్ని పే చెయ్యకపోతే ఆర్ఎంఆర్ చట్టం కింద ఆస్తుల జప్తు చేస్తామంటున్నారు అధికారులు. యాడికి మండలం, కోనుప్పలపాడులో 14లక్షల మెట్రిక్‌ టన్నుల అక్రమ మైనింగ్ జరిగినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించే వందకోట్ల జరిమానా విధించినట్లు తెలుస్తోంది. అక్రమాలపై ఆరోపణలు రావడంతో దీనిపై గత కొన్ని రోజులు విచారణ జరుపుతున్నారు మైనింగ్ అధికారులు.