‘ప్రావిడెంట్ ఫండ్’: దీర్ఘకాలంలో ఎక్కువ ప్రయోజనం

| Edited By:

Apr 29, 2019 | 5:57 PM

ప్రతి నెల ఉద్యోగి వేతనంలో కొంత భాగం ఈఫీఎఫ్ ఖాతాలో జమవుతుంది. దీనికి సమానమైన మొత్తాన్ని కంపెనీ కూడా ఈపీఎఫ్ అకౌంట్‌లో వేస్తుంది. అయితే చాలా కొద్ది మందికి మాత్రమే వారి పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను డబుల్ చేసుకోవచ్చనే విషయం తెలిసి ఉంటుంది. దీని వల్ల దీర్ఘకాలంలో ఎక్కువ వడ్డీ పొందొచ్చు. చాలా కంపెనీలు వారి ఉద్యోగులకు వారి వేతనాన్ని రిస్ట్రక్ఛర్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు వారి పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను పెంచుకోవచ్చు. అయితే పీఎఫ్ కంట్రిబ్యూషన్ […]

ప్రావిడెంట్ ఫండ్: దీర్ఘకాలంలో ఎక్కువ ప్రయోజనం
Covid-19 second Wave advances
Follow us on

ప్రతి నెల ఉద్యోగి వేతనంలో కొంత భాగం ఈఫీఎఫ్ ఖాతాలో జమవుతుంది. దీనికి సమానమైన మొత్తాన్ని కంపెనీ కూడా ఈపీఎఫ్ అకౌంట్‌లో వేస్తుంది. అయితే చాలా కొద్ది మందికి మాత్రమే వారి పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను డబుల్ చేసుకోవచ్చనే విషయం తెలిసి ఉంటుంది. దీని వల్ల దీర్ఘకాలంలో ఎక్కువ వడ్డీ పొందొచ్చు.

చాలా కంపెనీలు వారి ఉద్యోగులకు వారి వేతనాన్ని రిస్ట్రక్ఛర్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు వారి పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను పెంచుకోవచ్చు. అయితే పీఎఫ్ కంట్రిబ్యూషన్ ఎక్కువ చేస్తే మీకు వచ్చే వేతనం తగ్గుతుంది. అయితే దీర్ఘకాలంలో అధిక వడ్డీ, ఆదాయపు పన్ను చట్టం 80సీ కింద పన్ను ప్రయోజనాలు వంటి సౌకర్యాలు పొందొచ్చు.

ఉద్యోగి తన పీఎఫ్ కంట్రిబ్యూషన్ పెంచుకోవడానికి ఈపీఎఫ్‌వో అనుమతినిస్తుంది. ఈపీఎఫ్ అకౌంట్‌పై 8.65 శాతం వడ్డీని పొందొచ్చు. ఉద్యోగి బేసిక్ శాలరీ, డీఏలో 12 శాతం ఈపీఎఫ్ ఖాతాకు జమవుతుంది. ఇదే మొత్తాన్ని కంపెనీ కూడా ఈపీఎఫ్‌కు జమ చేస్తుంది.