Viral: బురదలో కూరుకుపోయిన గజరాజును ఎలా రక్షించారంటే ? అటవీ శాఖ ఐడియా అంటే అదేమరి !

| Edited By: Team Veegam

May 16, 2021 | 10:36 PM

బురదలో నిండా కూరుకుపోయి పైకి లేవలేక నానా పాట్లు పడుతున్న గజరాజును అటవీ శాఖ సిబ్బంది నేర్పుగా రక్షించారు. కర్నాటక లోని బందిపూర్ టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్ లో ఓ ఏనుగు ఎలా పడిందోగానీ బురదలో పడిపోయింది...

Viral: బురదలో కూరుకుపోయిన గజరాజును ఎలా రక్షించారంటే ? అటవీ శాఖ ఐడియా అంటే అదేమరి !
Female Stuck In Mud Pool In Badipur Tiger Reserve Rescued With The Help Of Jcb
Follow us on

బురదలో నిండా కూరుకుపోయి పైకి లేవలేక నానా పాట్లు పడుతున్న గజరాజును అటవీ శాఖ సిబ్బంది నేర్పుగా రక్షించారు. కర్నాటక లోని బందిపూర్ టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్ లో ఓ ఏనుగు ఎలా పడిందోగానీ బురదలో పడిపోయింది. భారీ శరీరం కారణంగా ఓ పట్టాన లేవలేక పోతున్న దాన్ని ఎలా సేవ్ చేయాలా అని ఈ శాఖ ఉద్యోగులు తెగ హైరానా పడ్డారు. తాము వెళ్లి ఆ మహా కాయాన్ని వెలికి తీయడం సాధ్యం కాదు.. పైగా అది బురద కూడా.. అయితే ఒకరికి ఓ ఐడియా తట్టింది. ఆ ఏనుగును రక్షించేందుకు ఓ జేసీబీనే తెప్పించారు. దాంతో చాకచక్యంగా ఆ ఆడ ఏనుగును సేవ్ చేయగలిగారు. డ్రైవర్ నేర్పుగా, ఓర్పుగా తన యంత్రంతో దాన్ని కాస్త పైకి లేపగలిగాడు. అంతే.. మొత్తానికి అది లేచి నిలబడి తన మానాన తాను చక్కాపోయింది. ఈ ఏనుగు రక్షా కార్యక్రమం తాలూకు వీడియో ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

మరిన్ని చదవండి ఇక్కడ : కరోనాతో తండ్రి మృతి.. చితిలో దూకిన కుమార్తె వైరల్ అవుతున్న వీడియో ..: viral video.

 Ward boy rapes Covid patient video: హాస్పిటల్ లో కరోనా పేషేంట్ పై వార్డ్ బాయ్ లైంగిక దాడి వైరల్ వీడియో..

Raghu Rama Krishna Raju : రఘురామకృష్ణంరాజుకు హై కోర్ట్ షాక్ బెయిల్ నిరాకరణ..!(వీడియో).

 నోయిడాలో మాటలకందని విషాదం.. పెద్ద కొడుక్కి అంత్యక్రియలు చేసొచ్చేలోగా చిన్నకొడుకు మృతి!కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో ..:coronavirus video