అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కనగానపల్లి మండలం మామిళ్లపల్లి లో తండ్రిని కొడుకు, కోడలు కలిసి హత్య చేశారు. నారాయణస్వామి అనే వ్యక్తిని కుమారుడు గణేష్, కోడలు అనిత ఇద్దరూ కలిసి హత్య చేసినట్లు ప్రాధమిక సమాచారం. కొడవలితో నరకడం వలన నారాయణస్వామి మృతి చెందినట్టు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. స్థానికుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.