ప్రధాని మోదీ స్పీచ్ ఎఫెక్ట్, కేంద్రంతో చర్చలు జరుపుదామా ? 36 రైతు సంఘాల యోచన, నేడు నిర్ణయం, సింఘు బోర్డర్ లో అదే సీన్

ప్రధాని మోదీ శుక్రవారం రైతులను ఉద్దేశించి చేసిన ప్రసంగంతో రైతు సంఘాలు మెత్త బడుతున్నట్టు కనిపిస్తోంది. ఆయన ఇచ్చిన హామీల నేపథ్యంలో కేంద్రంతో మళ్ళీ చర్చలు జరుపుదామా అని...

ప్రధాని మోదీ స్పీచ్ ఎఫెక్ట్, కేంద్రంతో చర్చలు జరుపుదామా ? 36 రైతు సంఘాల యోచన, నేడు నిర్ణయం, సింఘు బోర్డర్ లో అదే సీన్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 26, 2020 | 8:20 AM

ప్రధాని మోదీ శుక్రవారం రైతులను ఉద్దేశించి చేసిన ప్రసంగంతో రైతు సంఘాలు మెత్త బడుతున్నట్టు కనిపిస్తోంది. ఆయన ఇచ్చిన హామీల నేపథ్యంలో కేంద్రంతో మళ్ళీ చర్చలు జరుపుదామా అని 40 రైతు సంఘాలకు గాను 36 సంఘాలు మీమాంస లో పడ్డాయి. అయితే మొత్తం 40 సంఘాలు శనివారం సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోనున్నాయి. ఏమైనప్పటికీ రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన జరుపుతున్న రైతులతో చేతులు కలిపేందుకు యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి సుమారు 12 వేలమంది అన్నదాతలు నిన్న ఘాజీపూర్  చేరుకున్నారు. వీరిలో ఓ గుంపు ఢిల్లీ-జైపూర్ హైవేని దిగ్బంధం చేసింది.

ప్రధాని మోదీ నిన్న 9 కోట్ల మంది రైతులను ఉద్దేశించి ప్రసంగించి 18 వేల కోట్లను విడుదల చేశారు. రైతు చట్టాలు వారి మేలుకోసమే తప్ప హానికి కాదన్నారు. కానీ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు ఈ ప్రసంగాన్ని తప్పు పట్టాయి. ఇది అన్నదాతలను మభ్య పెట్టడానికేనని దుయ్యబట్టాయి. ఆప్ కు చెందిన ఎంపీలు నిన్న ఢిల్లీలో సమావేశమై కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొత్త చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.