దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు పడుతూ లేస్తున్నాయి. తాజాగా ఈ రోజు బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1957 డాలర్లకు తగ్గడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్ (MCX)లో బుధవారం పదిగ్రాముల పసిడి రూ. 65 తగ్గి రూ. 51,437 పలికింది. ఇక కిలో వెండి రూ. 1299 దిగివచ్చిరూ. 67,050 పడిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటంతో పాటు అమెరికా ఉత్పాదక గణాంకాలు అంతగా ప్రోత్సాహకరంగా ఉండటంతో మదుపరులు కరెన్సీ, ఈక్విటీల్లో పెట్టుబడులవైపు ఫోకస్ పెడుతున్నారు. ఇక ఆగస్ట్‌లో బంగారం ధరలు 56,000 రూపాయల రికార్డు స్ధాయికి చేరిన అనంతరం 5,000 రూపాయల వరకూ దిగివచ్చాయి. ఇలా మరికొద్ది రోజులు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి మెటల్స్ పై పెట్టడం ఓ మంచి అవకాశం అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.