హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ అరెస్ట్, వైద్య విద్య చదవకుండానే చికిత్స, ప్రజల ప్రాణాలతో చెలగాటం

వైద్యుడు అంటే దేవుడితో సమానం..ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా తారతమ్యం లేకుండా చేతులెత్తి మొక్కేది వైద్యుడికి మాత్రమే. అది ఆ వృత్తికి ఉన్న గొప్పతనం.

హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ అరెస్ట్, వైద్య విద్య చదవకుండానే చికిత్స, ప్రజల ప్రాణాలతో చెలగాటం

Updated on: Dec 09, 2020 | 4:45 PM

వైద్యుడు అంటే దేవుడితో సమానం..ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా తారతమ్యం లేకుండా చేతులెత్తి మొక్కేది వైద్యుడికి మాత్రమే. అది ఆ వృత్తికి ఉన్న గొప్పతనం. అలాంటి వైద్య వృత్తిలోకి ఎటువంటి చదువు, సాధన లేకుండానే కేటుగాళ్లు ప్రవేశిస్తున్నారు. అమాయికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.  నగరంలో మరో ఫేక్ డాక్టర్‌ వ్యవహరం కలకలం రేపింది. వైద్యం పేరుతో నకిలీ డాక్టర్‌ చేతివాటం ప్రదర్శించాడు. వైద్య విద్య చదవకుండానే బోర్డు పెట్టుకుని వైద్యం చేస్తున్న కేటుగాడిని మీర్‌పేట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కర్మన్‌ఘాట్‌కు చెందిన సాయికుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. మెడిసిన్‌ చదవకుండానే బోర్డు పెట్టుకుని వైద్యం చేస్తున్న అతడు.. సాయి క్లినిక్ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు ప్రాథమికంగా తేల్చారు. వైద్యవిద్య డిగ్రీకి సంబంధించి అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Live Updates: కేంద్ర ప్రతిపాదనలపై రైతు సంఘాల మధ్య తర్జన భర్జన..కొందరు సానుకూలం, మరికొందరు వ్యతిరేకం