మధుర ఆలయంలో నమాజ్ చేసిన వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్

మధుర లోని నంద్ బాబా ఆలయంలో నమాజ్ చేసిన ఇద్దరిలో ఒకడైన ఫైసల్ ఖాన్ కి కోవిడ్ పాజిటివ్ సోకింది. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.

మధుర ఆలయంలో నమాజ్ చేసిన వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్

Edited By:

Updated on: Nov 04, 2020 | 12:50 PM

మధుర లోని నంద్ బాబా ఆలయంలో నమాజ్ చేసిన ఇద్దరిలో ఒకడైన ఫైసల్ ఖాన్ కి కోవిడ్ పాజిటివ్ సోకింది. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే గుడిలో నమాజ్ చేసినందుకు గాను ఇతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతనిపైన మరో ముగ్గురిపైనా వారు ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశారు. ఆలయంలో వీరు నమాజ్ చేయడాన్ని అయోధ్య ధర్మకర్తలు, హిందూ సంఘాల సభ్యులు తీవ్రంగా  ఖండించారు. కాగా- ఆలయంలో తమ నమాజ్ ని అక్కడి కొందరు హిందువులే సమర్థించారని, ఏ దేవుడైనా ఒకడేనని, నమాజ్ చేసుకోవచ్చునని చెప్పారని ఫైసల్ ఖాన్ అంటున్నాడు.