వినియోగంలో లేని రేషన్ కార్డులు చెల్లవా.? వైరల్ అవుతున్న పోస్ట్.. వివరణ ఇచ్చిన కేంద్రం.!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనితో వాస్తవాల కంటే కల్పితాలే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. ఎలాంటి అడ్డు..

వినియోగంలో లేని రేషన్ కార్డులు చెల్లవా.? వైరల్ అవుతున్న పోస్ట్.. వివరణ ఇచ్చిన కేంద్రం.!

Updated on: Dec 23, 2020 | 1:46 PM

Ration Card Wont Cancelled: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనితో వాస్తవాల కంటే కల్పితాలే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఫేక్ న్యూస్ స్పీడ్‌గా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రజలను కంగారు పెట్టేలా ఓ పుకారు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

”మూడు నెలల పాటు రేషన్ కార్డులను వాడకపోతే ఇక చెల్లదని.. వినియోగంలో లేని రేషన్ కార్డులను తొలగించేలా రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది” అని ఆ వార్త సారంశం. దీనిపై తాజాగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. అవన్నీ వట్టి పుకార్లేనని.. అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని తేల్చి చెప్పింది. అందువల్ల వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Also Read:

‘స్ట్రెయిన్’ వైరస్ వ్యాప్తిపై కేంద్రం క్లారిటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టత..!

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. జనవరి 1 నుంచి చలానాల బాదుడు షురూ.. లైట్ తీసుకుంటే ఇక అంతే.!

ఆన్‌లైన్‌ కాల్‌మనీపై సీఎం జగన్ సీరియస్.. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..

‘సీబీఎస్‌సీ’ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలు వాయిదా.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..!