ప్రాణహాని ఉందంటూ ఫేస్ బుక్ ఎగిక్యూటివ్ ఆందోళన, పోలీసులకు ఫిర్యాదు

| Edited By: Anil kumar poka

Aug 17, 2020 | 2:33 PM

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఫేస్ బుక్ వ్యవహారం, ఓ ఆర్టికల్ పెను వివాదాన్ని రేపుతున్నాయి. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ ఢిల్లీలోని ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్ ఒకరు పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో కోరారు. 49 ఏళ్ళ ఈమె..

ప్రాణహాని ఉందంటూ ఫేస్ బుక్ ఎగిక్యూటివ్ ఆందోళన, పోలీసులకు ఫిర్యాదు
Follow us on

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఫేస్ బుక్ వ్యవహారం, ఓ ఆర్టికల్ పెను వివాదాన్ని రేపుతున్నాయి. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ ఢిల్లీలోని ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్ ఒకరు పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో కోరారు. 49 ఏళ్ళ ఈమె.. తనకు ఆన్ లైన్ ద్వారా, ఫోన్ ద్వారా బెదిరింపులు అందుతున్నాయని, వెంటనే పోలీస్ ప్రొటెక్షన్ అవసరమని అన్నారు. బీజేపీ నేతల ద్వేష పూరిత ప్రసంగాలను ఫేస్ బుక్ పట్టించుకోవడంలేదని అంటూ గతవారం ఈమె వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఓ ఆర్టికల్ రాసింది. ఈ ఆర్టికల్ ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హైలైట్ చేస్తూ.. ఇండియాలో బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ సోషల్ మీడియాను మ్యానిప్యులేట్ చేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమని ట్వీట్ చేశారు. అయితే ఈ ఆరోపణను ఖండించిన బీజేపీ..నాటి కేంబ్రిడ్జ్ ఎనాలిటీకాతో కాంగ్రెస్ పార్టీ అంటకాగిన విషయాన్ని గుర్తు చేసింది.

ఇక తనకు అయిదుగురు వ్యక్తులనుంచి బెదిరింపులు అందుతున్నాయని, వెంటనే వారిని అరెస్టు చేయాలని ఈ ఎగ్జిక్యూటివ్ వారి పేర్లను కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు., తమ గుర్తింపును దాచేందుకు వీరు ఆన్ లైన్ అకౌంట్ల ద్వారా ఆపరేట్ చేస్తున్నారనిపేర్కొన్న ఆమె..నిజానికి ఈ ఆర్టికల్ ని ఇండియాలో వార్తా పత్రికలు వక్రీకరించాయని, తప్పుడు సమాచారం ఇచ్చాయని ఆరోపించారు.