బెంగళూరులో మ‌రో వారం లాక్‌డౌన్ పొడిగింపు..

| Edited By:

Jul 17, 2020 | 4:20 PM

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరు న‌గ‌రపాల‌క సంస్థ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. లాక్‌డౌన్‌ను మ‌రో వారంపాటు పొడిగించాలని

బెంగళూరులో మ‌రో వారం లాక్‌డౌన్ పొడిగింపు..
Follow us on

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో క‌ర్ణాట‌క‌లోని బృహత్ బెంగళూరు మహానగర పాలికే కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. లాక్‌డౌన్‌ను మ‌రో వారంపాటు పొడిగించాలని నిర్ణయించింది. లాక్ డౌన్ స‌డ‌లింపుల త‌ర్వాత కరోనా కేసుల సంఖ్య పెరుగ‌డంతో బెంగ‌ళూరులో జూలై 14 నుంచి 23 వ‌ర‌కు లాక్‌డౌన్ విధించారు. అయినా కేసుల విషయంలో ఏమాత్రం ఫలితం లేకపోవడంతో మ‌రో వారం రోజులు లాక్‌డౌన్ పొడిగించాల‌ని నిర్ణ‌యించారు.

కోవిడ్ -19 కేసులు పెరగడంతో నగరంలో లాక్‌డౌన్‌ను మరో వారం పొడిగించాలని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బిబిఎంపి) మేయర్ ఎం. గౌతమ్ కుమార్ ఈ రోజు (శుక్రవారం) ప్రకటించారు. ఈ మేర‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న పంపిన‌ట్లు గౌతంకుమార్‌ తెలిపారు. న‌గ‌రంలో 2,000 కంటే ఎక్కువ కేసులు న‌మోదైన‌ హాట్‌స్పాట్‌లు, కంటైన్మెంట్ జోన్‌ల‌లో యాంటీజెన్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు మేయ‌ర్ చెప్పారు.

Also Read: యూజీసీ మార్గదర్శకాల మేరకు.. పరీక్షల నిర్వహణకే మొగ్గు..

Also Read: ఇక ప్రీ స్కూల్స్ గా అంగన్‌వాడీలు.. ఆన్‌లైన్‌లో బోధన..