మరో ఆశాకిరణం! కరోనాను ఎదుర్కొనే కొత్త వ్యాక్సిన్ !

కరోనా వ్యాక్సిన్ కోసం ప్ర‌పంచమంతా ప‌రిశోధ‌న‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌యోగాల్లో ప‌లు సానుకూల వ‌స్తున్నాయి.

మరో ఆశాకిరణం! కరోనాను ఎదుర్కొనే కొత్త వ్యాక్సిన్ !

Updated on: Sep 04, 2020 | 7:56 AM

కరోనా వ్యాక్సిన్ కోసం ప్ర‌పంచమంతా ప‌రిశోధ‌న‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌యోగాల్లో ప‌లు సానుకూల వ‌స్తున్నాయి. తాజాగా మరో ఆశాకిరణం మాన‌వ ప్ర‌పంచానికి ఉప‌శ‌మనాన్ని ఇస్తుంది. ప్ర‌త్యేకంగా కొన్ని ప్రొటీన్ల ఉత్పత్తికి ఉప‌యోగ‌ప‌డే ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ ఒకటి… కోవిడ్‌ను ప్రభావవంతంగా అడ్డుకోగలదని ఒహైయో వర్సిటీ పరిశోధనలో తేట‌తెల్లమైంది.

జీవ కణాలను ఇన్ఫెక్షన్‌కు గురిచేయడానికి వైరస్‌లు రెండు రకాల ప్రొటీన్లను టార్గెట్ చేస్తాయి. అయితే ఎలుకల్లో ఇవి అధిక మోతాదులో రిలీజ‌య్యేలా సైంటిస్టులు ‘సెల్యులార్‌ ప్రాసెస్‌’ చేపట్టారు. ఈ ప్రక్రియ వ‌ల‌న‌ వాటిలో జన్యు సమాచారాన్ని ఫంక్షనల్‌ ప్రొటీన్లుగా మార్చే ఆర్‌ఎన్‌ఏ మెసెంజర్‌ అణువుల సీక్వెన్స్‌ (అన్‌ట్రాన్స్‌లేటెడ్‌ రీజియన్స్‌- యూటీఆర్‌)లో మార్పులు సంభ‌విస్తున్నాయి. దీంతో ఈ ప్రొటీన్లు ఎక్కువ‌ మోతాదులో రిలీజ‌వ్వ‌డ‌మే కాకుండా, కొద్ది రోజుల్లోనే ఎలుకల్లో కొవిడ్‌ యాంటీబాడీలు డెవ‌ల‌ప్ అయ్యాయి. ప్రస్తుతం చాలా వ్యాక్సిన్‌లు మూడో దశ క్లినికల్ ట్ర‌య‌ల్స్ కంప్లీట్ చేసుకుంటున్నా… తమ ప్రయోగం కూడా వాటికి ఒక ప్రత్యామ్నాయాన్ని అందించగలదని పరిశోధనకర్త యుజో డాంగ్ వెల్ల‌డించారు.

Also Read :

ఐటీబీపీకి హోంశాఖ ఆర్డ‌ర్స్ , హైఅలర్ట్​

దిగొచ్చిన బంగారం, వెండి ధ‌ర‌లు : తాజా రేట్లు ఇలా !

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇంట విషాదం