తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత రాజకీయాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతూ ఉంటారు. ఆమె సోషల్ మీడియాలో ఖాతాలలో కూడా ఎక్కువ పాలిటిక్స్‌కి సంబంధించిన ట్వీట్స్ ఉంటాయి. లేదంటే ఎవరైనా సహాయం కోసం అభ్యర్థించినప్పుడు సీఎం తనయ రియాక్టవుతూ ఉంటారు.
అయితే ఈ రోజు ఉదయం ఓ ఫన్నీ ట్వీట్‌ను తన ఫాలోవర్స్‌తో షేర్ చేసుకున్నారు. ఆమె కుమారుడు ఓ ఫన్నీ కొటేషన్ పంపారంటూ..దానికి సంబంధించిన ఫోటోను పోస్ట్ చేశారు. ఆ కొటేషన్ సారాంశం ఇలా ఉంది. ‘ నా ఆలోచనలను బట్టి వీకెండ్స్‌ను చైనాలో స్టార్ట్ చేసి ఉండివచ్చు. అందుకే ఎక్కువ కాలం ఉండవు’. చైనా తయారయ్యే వస్తువులు క్వాలిటీ ఉండకపోవడం వల్ల ఎక్కువ కాలం మన్నిక ఉండదు. అలానే వారాంతాలు కూడా త్వరగా అయిపోతాయి కాబట్టి అవి కూడా చైనాలో తయారయ్యి ఉంటాయనేది అందులోని సెటైరికల్‌గా మీనింగ్. దీంతో అవును నిజమే అంటూ కవిత ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తున్నారు చాలామంది నెటిజన్లు.
My son shared it with me !! ? pic.twitter.com/FGJ27CKFeO
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2019