కేసీఆర్‌తో “ముదిరాజ్‌ల బంధం’ ఈనాటిది కాదుః ఈటల

|

Dec 23, 2019 | 5:02 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ముదిరాజ్‌లతో ఉన్న బంధం ఇనాటి కాదని చెప్పారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌. వారి మధ్య అనుబంధం కేసీఆర్‌ చిన్ననాడే ఏర్పండిందని వివరించారు. కేసీఆర్‌ తల్లిగారికి 12 మంది సంతానం కాగా, అందులో కేసీఆర్‌ బాల్యంలో తల్లిపాలు సరిగా అందలేదట. దాంతో వారి ఫ్యామిలీతో చనువుగా ఉండే ముదిరాజ్‌ మహిళ ఆయనకు పాలుపట్టించేదట. అలా కేసీఆర్‌కు ముదిరాజ్‌ కులస్తులతో ఆత్మీయ అనుబంధం ఉందని ఈటల వివరించారు. అందుకే ఆయనకు ముదిరాజులంటూ […]

కేసీఆర్‌తో ముదిరాజ్‌ల బంధం ఈనాటిది కాదుః ఈటల
Follow us on
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ముదిరాజ్‌లతో ఉన్న బంధం ఇనాటి కాదని చెప్పారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌. వారి మధ్య అనుబంధం కేసీఆర్‌ చిన్ననాడే ఏర్పండిందని వివరించారు. కేసీఆర్‌ తల్లిగారికి 12 మంది సంతానం కాగా, అందులో కేసీఆర్‌ బాల్యంలో తల్లిపాలు సరిగా అందలేదట. దాంతో వారి ఫ్యామిలీతో చనువుగా ఉండే ముదిరాజ్‌ మహిళ ఆయనకు పాలుపట్టించేదట.
అలా కేసీఆర్‌కు ముదిరాజ్‌ కులస్తులతో ఆత్మీయ అనుబంధం ఉందని ఈటల వివరించారు. అందుకే ఆయనకు ముదిరాజులంటూ అభిమానం ఎక్కవని చెప్పారు. వారి సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటుంటారని, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారాలు చూపుతున్నారని తెలిపారు. ఖమ్మం జిల్లా వెంకటగిరిలో జరిగిన ముదిరాజ్‌ కులస్తుల వనభోజనాల కార్యక్రమంలో పాల్గొన్న ఈటల ఈ విషయాలను వెల్లడించారు.