యుఎస్.. మంటల్లో మా రెస్టారెంట్ మండనివ్వండి… కానీ..

అమెరికాలోని మినియాపొలిస్ లో జార్జ్ ఫ్లాడ్ అనే నల్లజాతీయుని హత్యకు నిరసనగా పెద్ద ఎత్తున హింసాకాండ జరిగింది. ఆందోళనకారులు అనేక షాపులు, రెస్టారెంట్లకు సైతం నిప్పు పెట్టారు...

యుఎస్.. మంటల్లో మా రెస్టారెంట్ మండనివ్వండి... కానీ..

Edited By:

Updated on: May 30, 2020 | 8:09 PM

అమెరికాలోని మినియాపొలిస్ లో జార్జ్ ఫ్లాడ్ అనే నల్లజాతీయుని హత్యకు నిరసనగా పెద్ద ఎత్తున హింసాకాండ జరిగింది. ఆందోళనకారులు అనేక షాపులు, రెస్టారెంట్లకు సైతం నిప్పు పెట్టారు. ఇలా వారి ఆగ్రహానికి గురై తగులబడిన వాటిలో  ‘ గాంధీ మహల్’ అనే రెస్టారెంట్ కూడా ఉంది. కానీ దీని యజమానులు ఇందుకు చింతించడం లేదు. జార్జ్ ఫ్లాడ్ కుటుంబానికి న్యాయం జరగాలని తాము కోరుకుంటున్నామని, నిరసనకారులకే మద్దతునిస్తామని ఈ రెస్టారెంట్ యజమాని రూహేల్ కూతురైన హఫ్సా అంటోంది. జస్టిస్ ఫర్ జార్జ్ ఫ్లాడ్ అండ్ బీ ఎం ఎల్ (బ్లాక్ లివ్స్ మేటర్) అని ఆమె ట్వీట్ చేసింది. ఈ సంస్థ నల్ల జాతీయుల రక్షణకు కృషి చేస్తున్న విషయాన్ని ఆమె ప్రస్తావించింది. మా రెస్టారెంట్ తగులబడినందుకు తమకు చింత లేదని, కానీ ఆ పోలీసులకు తగిన శిక్ష విధించాలని హఫ్సా కోరింది. అప్పుడే మాకు తృప్తి అని పేర్కొంది.

Loading...
Unable to load recommendations.
Follow Us