CSK Win : పంజాబ్‌ కథ కంచికి..

లీగ్ ముగింపులో చెన్నై సూపర్ కింగ్స్ దూకుడు పెంచింది. దీంతో మిగిలిన జట్ల జతకాలు మారిపోతున్నాయి. అబుదాబి వేదికగా జరిగిన రసవత్తర పోరులో పంజాబ్‌ కథ కంచికి చేరింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసి టోర్నీ నుంచి వెనుదిరిగింది...

CSK Win : పంజాబ్‌ కథ కంచికి..
Follow us

|

Updated on: Nov 01, 2020 | 8:03 PM

Chennai Super Kings Win by 9 Wickets : లీగ్ ముగింపులో చెన్నై సూపర్ కింగ్స్ దూకుడు పెంచింది. దీంతో మిగిలిన జట్ల జతకాలు మారిపోతున్నాయి. అబుదాబి వేదికగా జరిగిన రసవత్తర పోరులో పంజాబ్‌ కథ కంచికి చేరింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసి టోర్నీ నుంచి వెనుదిరిగింది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దీపక్ హుడా 30 బంతుల్లో 62 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించాడు. అనంతరం బరిలోకి దిగిన చెన్నై 18.5 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. ఓపెనర్లు రుతురాజ్‌ 49 బంతుల్లో 62 పరుగులు చేయగా…, డుప్లెసిస్‌ 34 బంతుల్లో 48 పరుగులతో రాణించి సత్తాచాటారు.

పంజాబ్ జట్టు పెట్టిన టార్గెట్‌ను ఛేదనకు దిగిన డుప్లెసిస్, రుతురాజ్‌ అదిరే దూకుడుతో ఆటను మొదలు పెట్టారు. వీరిద్దరూ బౌండరీల బాదుతూ మెరుపులు మెరిపించారు. పవర్‌ప్లేలో 57 పరుగుల స్కోరును జోడించారు. అయితే హాఫ్ సెంచరీకి చేరువవుతున్న డుప్లెసిస్‌ను జోర్డాన్‌ ఔట్‌ చేయడంతో 82 పరుగుల వద్ద చెన్నై తొలి వికెట్ కోల్పోయింది.

మరోవైపు రుతురాజ్‌ తన దూకుడును కొనసాగించాడు. రాయుడు 30 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో హాఫ్ సెంచరీతో అందుకున్నాడు. అనంతరం మరింత చెలరేగి 7 బంతులు మిగిలుండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌‌ వరుసగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ హాఫ్‌ సెంచరీలు సాధించడం విశేషం.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాహుల్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. పంజాబ్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మయాంక్ అగర్వాల్‌ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించారు. ఎంగిడి బౌలింగ్‌లో మయాంక్‌ ఔటైనప్పటికీ పవర్‌ప్లేలో 53 పరుగులతో గొప్ప స్థితిలోనే నిలిచింది. అయితే తర్వాత చెన్నై బౌలర్లు పుంజుకుని స్వల్ప వ్యవధిలోనే రాహుల్‌, నికోలస్‌ పూరన్ , క్రిస్‌ గేల్‌ ను పెవిలియన్‌కు చేర్చారు.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్‌ హుడా ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చాడు. మన్‌దీప్‌ సింగ్‌ తో కలిసి తొలుత నిదానంగా ఆడిన హుడా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 26 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. చెన్నై బౌలర్లలో ఎంగిడి మూడు వికెట్లు, జడేజా, తాహిర్‌, శార్దూల్‌ తలో వికెట్ తీశారు.