ఈపీఎఫ్ ఖాతాదారులకు సూచన… వడ్డీ చెల్లింపుపై కీలక నిర్ణయం

|

Sep 09, 2020 | 8:12 PM

ఈపీఎఫ్ లెక్క తేలింది. ఈ ఉదయం నుంచి కూస్తి పట్టిన అధికారులు చివరిక  లెక్క తేల్చారు. వేతన జీవుల ఈపీఎఫ్‌ ఖాతాల్లో 2019-20 సంవత్సరానికి గాను 8.5 శాతం వడ్డీ జమ చేసేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO) నిర్ణయించింది.  ఖాతాదారుల అకౌంట్‌లోకి వడ్డీ చెల్లింపుపై కీలక నిర్ణయం తీసుకుంది.

ఈపీఎఫ్ ఖాతాదారులకు సూచన... వడ్డీ చెల్లింపుపై కీలక నిర్ణయం
Follow us on

EPFO will be Pay Interest  : ఈపీఎఫ్ లెక్క తేలింది. ఈ ఉదయం నుంచి కూస్తి పట్టిన అధికారులు చివరిక  లెక్క తేల్చారు. వేతన జీవుల ఈపీఎఫ్‌ ఖాతాల్లో 2019-20 సంవత్సరానికి గాను 8.5 శాతం వడ్డీ జమ చేసేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO) నిర్ణయించింది.  ఖాతాదారుల అకౌంట్‌లోకి వడ్డీ చెల్లింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారుల అకౌంట్‌లోకి 2019-20 ఆర్థిక సంవత్సరానికి చెందిన వడ్డీని రెండు విడతల్లో చెల్లించాలని నిర్ణయించింది. అయితే, తొలుత 8.15 శాతం చెల్లించి, మిగిలిన 0.35 శాతం డిసెంబర్‌లో చెల్లించాలని నిర్ణయించింది. బుధవారం జరిగిన ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొత్తం 6 కోట్ల చందాదారుల ఖాతాల్లో ఈ మొత్తం జమ చేయనున్నారు.

నిధుల కొరతను అధిగమించేందుకు స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయాన్ని ఈ సమావేశంలో ఉపసంహరించుకున్నారు. కొవిడ్‌-19 కారణంగా మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే వడ్డీ జమ ఆలస్యం అంశాన్ని కొందరు ట్రస్టీలు ఈ సమావేశంలో లేవనెత్తారు.

కాగా, 2019-2020 ఆర్థిక సంవత్సరానికి భవిష్య నిధి మొత్తాలపై 8.5 శాతం వడ్డీ ఇవ్వాలని మార్చిలో జరిగిన ట్రస్టీల సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే  రెండో విడత 0.35 శాతం వడ్డీని జమ చేసే విషయంపై డిసెంబర్‌లో మరోసారి బోర్డు సమావేశం కానుంది.