‘అమ్మ ఒడి’లో చేరేందుకు ఆఖరి ఛాన్స్…

నవరత్నాల్లో భాగమైన ‘అమ్మ ఒడి’ పథకం విధి, విధానాలపై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  అర్హులైన వారందరికీ..లబ్ది చేకూరేలా ప్రభ్యుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. కాగా  ‘అమ్మ ఒడి’ కి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఆఖరి ఛాన్స్ ఇచ్చింది. ఇప్పుటివరకు నమోదు చేసుకోనివారు ఎవరైనా ఉంటే..జనవరి 5 వ తేదీ సాయంత్రం 5 గంటలోగా..సంబంధిత అధికారులకు దరఖాస్తు సమర్పించాలని మంత్రి స్పష్టం చేశారు. పథకం అమలు పట్ల ప్రభుత్వం […]

అమ్మ ఒడిలో చేరేందుకు ఆఖరి ఛాన్స్...

Updated on: Jan 04, 2020 | 8:12 PM

నవరత్నాల్లో భాగమైన ‘అమ్మ ఒడి’ పథకం విధి, విధానాలపై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  అర్హులైన వారందరికీ..లబ్ది చేకూరేలా ప్రభ్యుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. కాగా  ‘అమ్మ ఒడి’ కి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఆఖరి ఛాన్స్ ఇచ్చింది. ఇప్పుటివరకు నమోదు చేసుకోనివారు ఎవరైనా ఉంటే..జనవరి 5 వ తేదీ సాయంత్రం 5 గంటలోగా..సంబంధిత అధికారులకు దరఖాస్తు సమర్పించాలని మంత్రి స్పష్టం చేశారు.

పథకం అమలు పట్ల ప్రభుత్వం పూర్తి నిబద్దతతో ఉందని, పారదర్శకంగా అర్హుల ఎంపిక చేపడతామని వెల్లడించారు. కాగా ఇప్పుటికే 42 లక్షల 80 వేల 753 మందిని పథకానికి అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. వీరి కోసం రూ. 6,421 కోట్లను కేటాయించింది.  జనవరి 9న సీఎం జగన్ చిత్తూరులో ‘అమ్మ ఒడి’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ స్కీమ్ ద్వారా 1 వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే స్టూడెంట్స్ తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఏటా రూ. 15 వేలు జమ చేయనుంది ప్రభుత్వం.