కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. 9 మంది జవాన్లు మృతి..

కొలంబియాలో ఆర్మీ చాపర్‌ ఒకటి కుప్పకూలింది. ఈ ఘటనలో పదకొండు మంది జవాన్లు కనపడకుండా పోయారు. అందులో తొమ్మిది మంది సైనికుల మృతదేహాలను గుర్తించారు. మరో ఇద్దరి జాడ తెలియరాలేదు. అయితే..

కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. 9 మంది జవాన్లు మృతి..

Edited By:

Updated on: Jul 22, 2020 | 9:38 AM

కొలంబియాలో ఆర్మీ చాపర్‌ ఒకటి కుప్పకూలింది. ఈ ఘటనలో పదకొండు మంది జవాన్లు కనపడకుండా పోయారు. అందులో తొమ్మిది మంది సైనికుల మృతదేహాలను గుర్తించారు. మరో ఇద్దరి జాడ తెలియరాలేదు. అయితే ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో 17 మంది జవాన్లు ఉన్నారని అధికారులు తెలిపారు. మరో ఆరు మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారన్నారు. ఈ విషయాన్ని కొలంబియా సైన్యం ప్రకటించింది.

దేశంలోని ఆగ్నేయ ప్రాంతంలో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్నగెరిల్లాలను అణ‌చివేసేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా మంగళవారం నాడు.. 17 మంది జవాన్లతో హెలికాప్టర్‌ బయల్దేరిందన్నారు. అయితే ఈ క్రమంలోనే గ్వావియర్ రాష్ట్రం సమీపంలోని ఇనిరిడా నది సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. నది సమీపంలోనే చాపర్ శకలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ నది సమీపంలో ఫార్మ‌ర్ రివ‌ల్యూష‌న‌రీ ఆర్ముడ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా (ఎఫ్ఏఆర్‌సీ) ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ గెరిల్లాలే ఆర్మీకి చెందిన చాపర్‌ను కుప్పకూల్చారా.. లేదా ప్రమాదవశాత్తు కుప్పకూలిందా అన్న విషయం తేలాల్సి ఉంది.