ఆధార్‌తో ఓటర్ ఐడీ లింక్.. బోగస్ ఓట్లకు చెక్..

| Edited By:

Aug 17, 2019 | 9:08 AM

ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఓటర్ కార్డుల్లో అవకతవకలని అరికట్టలేకపోయింది. ఎన్నికల సమయం వచ్చేనాటికి బోగస్ కార్డులు బయటపడుతూనే ఉన్నాయి. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో లక్షలాది ఓట్లు గల్లంతయ్యాయి. ఎన్నికలను సజావుగా జరపలేకపోయిందని ఈసీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా బోగర్ కార్డులను ఈసీ నియంత్రించలేకపోతోంది. బోగస్ కార్డులను అరికట్టేందుకు ఈసీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలని కోరుతూ న్యాయ శాఖకు ఈసీ లేఖ […]

ఆధార్‌తో ఓటర్ ఐడీ లింక్.. బోగస్ ఓట్లకు చెక్..
Follow us on

ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఓటర్ కార్డుల్లో అవకతవకలని అరికట్టలేకపోయింది. ఎన్నికల సమయం వచ్చేనాటికి బోగస్ కార్డులు బయటపడుతూనే ఉన్నాయి. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో లక్షలాది ఓట్లు గల్లంతయ్యాయి. ఎన్నికలను సజావుగా జరపలేకపోయిందని ఈసీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా బోగర్ కార్డులను ఈసీ నియంత్రించలేకపోతోంది. బోగస్ కార్డులను అరికట్టేందుకు ఈసీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలని కోరుతూ న్యాయ శాఖకు ఈసీ లేఖ రాసింది. ఓటర్ కార్డును ఆధార్ తో లింక్ చేయడం వల్ల నకిలీ దరఖాస్తులు బోగస్ ఓట్లను సులభంగా తీసేయొచ్చనని తెలిపింది. ఇక ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడం వల్ల ఒక్కొక్కరికి ఒక్క ఓటు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పింది. కాగా, ఇప్పటికే 32 కోట్ల ఆధార్ నంబర్లు ఓటర్ ఐడీ కార్డులతో లింక్ అయ్యాయి. ఇక ఈ అంశంపై ఈసీ న్యాయశాఖకు లేఖ రాయడం ఇదే తొలిసారి. ఈ లింకింగ్ తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950కి మార్పులు చేయాలని కూడా ఈసీ న్యాయ శాఖకు ప్రతిపాదించింది. ఈ నిర్ణయంతో దొంగ ఓట్లు లేకుండా ఎన్నికలు జరుపవచ్చని ఈసీ భావిస్తోంది.