కరోనా మహమ్మారి కుటుంబాలనే మింగేస్తోంది. అమాయకుల ప్రాణాలను వైరస్ సోకిన గంటల వ్యవధిలోనే హరిస్తోంది. సిద్ధిపేట జిల్లాలో ఇలాంటి విషాద ఘటన ఒకటి చోటుచేసుకుంది. కరోనా బారిన పడి గంటల వ్యవధిలో వృద్ద దంపతులు మృతి చెందారు. సిద్దిపేట పట్టణానికి చెందిన ఐత లింగం(80) అతని భార్య భూలక్ష్మి (75) లు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఇద్దరి ఆస్పత్రిలో చేర్పించి వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో వీరిద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్థారించగా సోమవారం రాత్రి సిద్దిపేట కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలో చేరే సమయంలో భూలక్ష్మి మృతి చెందగా.. అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో లింగం కూడా తుదిశ్వాస విడిచారు.కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే వృద్ద దంపతులు మృతి చెందడం పలువురిని కలచివేసింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర దు:ఖసాగరంలో మునిగిపోయింది.