మండే ఎండలు : 15 నగరాల్లో 8 మనవే..!

| Edited By:

Jun 03, 2019 | 4:57 PM

దేశంపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో ఆదివారం ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత రాజస్థాన్‌లోని చురులో 48.9 డిగ్రీలుగా నమోదైంది. దాని తర్వాత శ్రీగంగానగర్‌లో 48.6 డిగ్రీలసెల్సియస్, పాకిస్థాన్‌లోని జకోబాబాద్‌లో 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా.. దేశ రాజధాని ఢిల్లీలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 38 డిగ్రీలు, తెలంగాణాలో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఎల్ డొరాడో వెబ్ సైట్ విడుదల చేసిన జాబితా ప్రకారం.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన […]

మండే ఎండలు : 15 నగరాల్లో 8 మనవే..!
Follow us on

దేశంపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో ఆదివారం ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత రాజస్థాన్‌లోని చురులో 48.9 డిగ్రీలుగా నమోదైంది. దాని తర్వాత శ్రీగంగానగర్‌లో 48.6 డిగ్రీలసెల్సియస్, పాకిస్థాన్‌లోని జకోబాబాద్‌లో 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా.. దేశ రాజధాని ఢిల్లీలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 38 డిగ్రీలు, తెలంగాణాలో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఎల్ డొరాడో వెబ్ సైట్ విడుదల చేసిన జాబితా ప్రకారం.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన తొలి 15 నగరాల్లో 8 భారత్‌లోనే ఉండటం విశేషం.