అగస్టా కేసులో రూ.8.46 కోట్ల ఆస్తులు అటాచ్‌

|

Mar 12, 2019 | 9:04 AM

న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో న్యాయవాది గౌతం ఖెతాన్‌కు చెందిన రూ.8.46 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోమవారం అటాచ్‌ చేసింది. రెండో దశ విచారణలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు సంస్థ తెలిపింది. వెల్లడించని విదేశీ ఖాతాలను ఆయన కలిగి ఉన్నారని వెల్లడించింది. ఈ ఖాతాల ద్వారా భారీ మొత్తంలో సింగపూర్, మారిషస్‌ దేశాల నుంచి విదేశీ కరెన్సీని ఖెతాన్‌ పొందినట్లు విచారణలో తేలిందని ఈడీ వివరించింది. ఢిల్లీ, హరియాణా, […]

అగస్టా కేసులో రూ.8.46 కోట్ల  ఆస్తులు అటాచ్‌
Follow us on

న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో న్యాయవాది గౌతం ఖెతాన్‌కు చెందిన రూ.8.46 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోమవారం అటాచ్‌ చేసింది. రెండో దశ విచారణలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు సంస్థ తెలిపింది. వెల్లడించని విదేశీ ఖాతాలను ఆయన కలిగి ఉన్నారని వెల్లడించింది. ఈ ఖాతాల ద్వారా భారీ మొత్తంలో సింగపూర్, మారిషస్‌ దేశాల నుంచి విదేశీ కరెన్సీని ఖెతాన్‌ పొందినట్లు విచారణలో తేలిందని ఈడీ వివరించింది.

ఢిల్లీ, హరియాణా, ఉత్తరాఖండ్‌లలో ఆయన ఆస్తులు కలిగి ఉన్నారని, ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అగస్టా కేసులో నిందితుడిగా ఉన్న ఖెతాన్‌ బెయిల్‌పై బయట ఉన్నారు. అయితే మనీ లాండరింగ్‌ కింద ఈడీ కేసు నమోదు చేసి ఆయనను జనవరి 25న అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన జ్యూడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఆదాయపన్ను శాఖ వివరాలను ఆధారంగా చేసుకుని తాజాగా ఆయనపై మరో కేసును ఈడీ నమోదు చేసింది.