Dubbaka Dangal: దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలు హోరాహోరీగా సాగుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఫలితం దోబూచులాడుతోంది. 18వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 688 ఓట్లు ఆధిక్యం వచ్చింది. 18వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 3,215, బీజేపీ – 2,527, కాంగ్రెస్- 852 ఓట్లు వచ్చాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 174 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఇప్పటివరకు బీజేపీకి 50,467, టీఆర్ఎస్‌కు 50,293, కాంగ్రెస్‌కు 17,389 ఓట్లు వచ్చాయి..