హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఓ డ్రగ్ ముఠాను ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన ఐదుగురు వ్యక్తుల నుంచి 155 గ్రాముల నిషేధిత హషీస్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వ్యక్తులు డ్రగ్స్ కు బానిస అయినట్లు అధికారులు వివరించారు. తరచూ గంజాయితో పాటు హషీస్ ఆయిల్‌ను సేవిస్తున్నారని వెల్లడించారు.
వీరు హషీస్ ఆయిల్‌ను సేవించడమే కాకుండా బోయిన్‌పల్లి, మల్కాజ్‌గిరి ఏరియాల్లో తెలిసిన వ్యక్తులకు విక్రయాలు జరుపుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. విక్రమ్, సాయి రెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల నుంచి ఈ ఐదుగురు హషీస్ ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అయితే వీరు ఆంధ్రాలోని అరకు ఏజెన్సీ ఏరియాల నుంచి 5 గ్రాముల హషీస్ ఆయిల్‌ను రూ. 1500 చెల్లించి కొనుగోలు చేస్తున్నారని అధికారుల విచారణలో వెల్లడైంది.
Also Read :
తల్లిదండ్రులతో గొడవ, కొడుకు ఆత్మహత్య