ఆకాశ్ క్షిపణితో.. మళ్లీ అందనంత ఎత్తుకు

| Edited By:

May 28, 2019 | 11:45 AM

భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. భారత రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ ఆకాశ్‌ -1ఎస్‌ క్షిపణిని సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్‌ తీరం నుంచి దీనిని ప్రయోగించింది. భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం గల ఈ క్షిపణిని.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీవో రూపొందించింది. భూ ఉపరితలం నుంచి 18 నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శత్రు దేశాల యుద్ధ విమానాలు, క్రూయీజ్‌ క్షిపణులు, బాలిస్టిక్‌ క్షిపణులు, […]

ఆకాశ్ క్షిపణితో.. మళ్లీ అందనంత ఎత్తుకు
Follow us on

భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. భారత రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ ఆకాశ్‌ -1ఎస్‌ క్షిపణిని సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్‌ తీరం నుంచి దీనిని ప్రయోగించింది. భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం గల ఈ క్షిపణిని.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీవో రూపొందించింది. భూ ఉపరితలం నుంచి 18 నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శత్రు దేశాల యుద్ధ విమానాలు, క్రూయీజ్‌ క్షిపణులు, బాలిస్టిక్‌ క్షిపణులు, డ్రోన్లను ఆకాశ్‌- 1ఎస్‌ సమర్థంగా కూల్చేయగలదు.

కాగా, రెండు రోజుల వ్యవధిలో ఈ క్షిపణిని రెండు సార్లు విజయవంతంగా ప్రయోగించినట్లు డీఆర్డీవో వెల్లడించింది. ఆకాశ్‌-1ఎస్‌ క్షిపణిని మే 25, 27న పరీక్షించినట్లు తెలిపింది.