‘దోస్త్’ ఫేజ్-1 అడ్మిషన్ల ప్రక్రియ.. మరో మూడు రోజులే గడువు..

|

Sep 04, 2020 | 2:49 PM

ప్రస్తుతం 'దోస్త్'కు సంబంధించిన మొదటి ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. విద్యార్థులు అప్లయ్ చేసుకోవడానికి మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది.

‘దోస్త్’ ఫేజ్-1 అడ్మిషన్ల ప్రక్రియ.. మరో మూడు రోజులే గడువు..
Follow us on

Dost Admissions Process: తెలంగాణలో ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి ‘దోస్త్’‌ నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్ లేదా దానికి సమాన అర్హత ఉన్నవారు ‘దోస్త్’ ద్వారా డిగ్రీ అడ్మిషన్ పొందవచ్చు. ఆగష్టు 24 నుంచి మొదలైన ఈ ‘దోస్త్’ అడ్మిషన్ల ప్రక్రియ మూడు ఫేజ్‌లలో అక్టోబర్ 12 నాటికి పూర్తి కానుంది. ఇక ఆ తర్వాత విద్యార్థులకు డిజిటల్ లేదా ఫిజికల్ క్లాసులు మొదలుపెట్టనున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘దోస్త్’కు సంబంధించిన మొదటి ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. విద్యార్థులు అప్లయ్ చేసుకోవడానికి మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ మొదటి ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ఆగష్టు 24న ప్రారంభం కాగా.. సెప్టెంబర్ 7తో ముగియనుంది. దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు https://dost.cgg.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు తెలిపారు. అలాగే 105 దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలతో పాటు T App Folio Mobile Appలో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చునని స్పష్టం చేశారు.

Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..