AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరిహద్దులో పరిస్థితులు కాస్త ఉద్రిక్తంగానే ఉన్నాయి: ఆర్మీ చీఫ్

భారత్-చైనా వాస్త‌వాధీన వెంబడి ప్రస్తుత ప‌రిస్థితి కొంత ఉద్రిక్తంగానే ఉంద‌ని ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఎంఎం న‌ర‌వాణె తెలిపారు. చైనాతో స‌రిహ‌ద్దు స‌మ‌స్య త‌లెత్తిన నేప‌థ్యంలో ఆర్మీ చీఫ్‌ జ‌న‌ర‌ల్ న‌ర‌వాణె లేహ్‌లో ప‌ర్య‌టిస్తున్నారు.

సరిహద్దులో పరిస్థితులు కాస్త ఉద్రిక్తంగానే ఉన్నాయి: ఆర్మీ చీఫ్
Balaraju Goud
|

Updated on: Sep 04, 2020 | 2:04 PM

Share

భారత్-చైనా వాస్త‌వాధీన వెంబడి ప్రస్తుత ప‌రిస్థితి కొంత ఉద్రిక్తంగానే ఉంద‌ని ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఎంఎం న‌ర‌వాణె తెలిపారు. చైనాతో స‌రిహ‌ద్దు స‌మ‌స్య త‌లెత్తిన నేప‌థ్యంలో ఆర్మీ చీఫ్‌ జ‌న‌ర‌ల్ న‌ర‌వాణె లేహ్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. రెండు రోజ‌లు ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న ప‌లు ప్రాంతాల‌ను విజిట్ చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. లేహ్ చేరుకున్న త‌ర్వాత ప‌లు ప్రాంతాల‌ను విజిట్ చేశాన‌ని, ఆఫీస‌ర్లు, జేసీవోల‌తో మాట్లాడాన‌ని, ద‌ళాలు ఎంత వ‌ర‌కు సంసిద్ధంగా ఉన్నాయన్నారు. జ‌వాన్ల‌లో స్పూర్తి నింపేందుకు పర్యటించినట్లు చెప్పిన ఆయన ఎటువంటి స‌వాళ్ల‌ను అయినా ఎదుర్కొనేందుకు వారంతా సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు.

ఎల్ఏసీ వెంబడి బ‌ల‌గాల‌ను పెంచిన‌ట్లు చెప్పిన ఆయన.. ప‌రిస్థితులకు అనుగుణంగా ముందు జాగ్ర‌త్త‌లు తీసుకున్నామ‌ని, మ‌న భ‌ద్ర‌త‌, ఐక్య‌త సుర‌క్షితంగా ఉండేందుకు ఈ చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. గ‌త రెండు మూడు నెల‌ల నుంచి ఎల్ఏసీ వెంట ప‌రిస్థితి ఉద్రిక్తంగా ఉన్న‌ట్లు నరవాణె చెప్పారు. కానీ సైనిక‌, దౌత్య‌ప‌ర‌మైన స్థాయిలో చైనాతో నిరంత‌రం చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. భ‌విష్య‌త్తులో కూడా చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తూనే ఉంటామ‌న్నారు. చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉన్న‌ట్లు ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ తెలిపారు.

Follow Us
గుట్టలపై దాగిన 400 ఏళ్ల రహస్యం!
గుట్టలపై దాగిన 400 ఏళ్ల రహస్యం!
రెప్ప పాటులో లాక్కెళ్లిన రాకాసి అలలు.. వాళ్లే గనుక లేకుంటే...!
రెప్ప పాటులో లాక్కెళ్లిన రాకాసి అలలు.. వాళ్లే గనుక లేకుంటే...!
స్పూన్ తింటే నడవలేని వాళ్ళు కూడా రేసు గుర్రంలా ఉరుకులు పెడతారు
స్పూన్ తింటే నడవలేని వాళ్ళు కూడా రేసు గుర్రంలా ఉరుకులు పెడతారు
అప్పుడు ఎత్తుకుని పెంచాం.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు..
అప్పుడు ఎత్తుకుని పెంచాం.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు..
ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ తప్పులు చేయకపోతే మీ భవనం పదిలం
ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ తప్పులు చేయకపోతే మీ భవనం పదిలం
హిమాలయాల్లో భారత ఆర్మీ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్!
హిమాలయాల్లో భారత ఆర్మీ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్!
సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో జర్నీ చేసిన టీమిండియా దిగ్గజం..!
సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో జర్నీ చేసిన టీమిండియా దిగ్గజం..!
వర్షాకాలంలో గులాబీలు పూలతో కళకళలాడాలంటే.. సింపుల్ టిప్స్ పాటిస్తే
వర్షాకాలంలో గులాబీలు పూలతో కళకళలాడాలంటే.. సింపుల్ టిప్స్ పాటిస్తే
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
రోజుకో రంగు మారే వింత పువ్వు.. నిన్న, నేడు, రేపు మొక్కను ఇంట్లోనే
రోజుకో రంగు మారే వింత పువ్వు.. నిన్న, నేడు, రేపు మొక్కను ఇంట్లోనే