ప్రముఖుల పాఠ్యాంశాలు తొలగించవద్దుః చిత్ర రామచంద్రన్‌

|

Sep 24, 2020 | 6:51 PM

కరోనా లాక్ డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే పరిస్థితి లేదు. సిలబస్ ను కూడా తగ్గించేందుకు నిర్ణయించింది. అయితే, సిలబస్ కుదింపుపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

ప్రముఖుల పాఠ్యాంశాలు తొలగించవద్దుః చిత్ర రామచంద్రన్‌
Follow us on

కరోనా లాక్ డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసులకు అనుమతినిచ్చింది. అంతేకాకుండా సిలబస్ ను కూడా తగ్గించేందుకు నిర్ణయించింది. అయితే, సిలబస్ కుదింపుపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇంటర్‌ పాఠ్యపుస్తకాల నుంచి జాతీయ నేతలు, సంఘ సంస్కర్తల పాఠ్యాంశాలను తొలగించవద్దని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్‌ గురువారం ఇంటర్‌ బోర్డును ఆదేశించారు. కరోనా నేపథ్యంలో ఇంటర్‌ సిలబస్‌ కుదింపునకు ప్రభుత్వం యోచిస్తున్నది. దీనికి ఇంకా కాంపిటెంట్‌ అథారిటీ అనుమతి లభించ లేదు. ఇప్పటికే ఈ అంశంపై సబ్జెక్టు నిపుణులు తమ సిఫార్సులు చేశారు. ఈ నేపథ్యంలో సిలబస్‌ కుదిస్తే జాతీయ నేతలు, సంఘ సంస్కర్తల పాఠ్యాంశాలు తొలగించవద్దంటూ చిత్ర రామచంద్రన్‌ బోర్డు అధికారులకు సూచించారు. సిలబస్ కుదింపుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.