పీఓకే వాసులకు ఇమ్రాన్‌ఖాన్‌ వార్నింగ్!.. ‘ఇది మరో ఎత్తుగడా?’

|

Oct 06, 2019 | 5:03 PM

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని నిరసనకారులు ఆదివారం భారీయెత్తున నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్దకు దూసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్ రద్దు చేయడంతో నిరసన తెలిపేందుకే వారు వస్తున్నట్టు సమాచారం. ఎల్‌వోసీ దాటొద్దని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ శనివారం వారిని హెచ్చరించారు. కశ్మీరీలకు మానవతా దృక్పథంతో సాయం చేసేందుకు ఎల్‌వోసీని దాటితే భారత్‌ చెప్పే కథనాలకు బలం చేకూరుతుందని అన్నారు. ఆయన మాటలు నిరసనకారులను నిలువరించేలా కాకుండా ఎంకరేజ్ చేసినట్టుగా కనిపిస్తోంది. a […]

పీఓకే వాసులకు ఇమ్రాన్‌ఖాన్‌ వార్నింగ్!.. ఇది మరో ఎత్తుగడా?
Follow us on

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని నిరసనకారులు ఆదివారం భారీయెత్తున నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్దకు దూసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్ రద్దు చేయడంతో నిరసన తెలిపేందుకే వారు వస్తున్నట్టు సమాచారం. ఎల్‌వోసీ దాటొద్దని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ శనివారం వారిని హెచ్చరించారు. కశ్మీరీలకు మానవతా దృక్పథంతో సాయం చేసేందుకు ఎల్‌వోసీని దాటితే భారత్‌ చెప్పే కథనాలకు బలం చేకూరుతుందని అన్నారు. ఆయన మాటలు నిరసనకారులను నిలువరించేలా కాకుండా ఎంకరేజ్ చేసినట్టుగా కనిపిస్తోంది.

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడం, రాష్ట్రాన్ని విభజించడం తమ అంతర్గత వ్యవహారమని భారత్‌ ఎంత చెప్పినా పాక్‌ వినడం లేదు. కశ్మీరీల స్వేచ్ఛను అణిచేస్తున్నారని మొసలి కన్నీరు కారుస్తోంది. అంతర్జాతీయ సమాజంలో భారత్‌ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తోంది. అయితే దాయాది చర్యలకు ఏ దేశమూ మద్దతు ఇవ్వడం లేదు.

పీవోకే రాజధాని ముజఫరాబాద్‌ నుంచి బయల్దేరిన నిరసనకారుల్లో ఎక్కువ మంది యువకులే ఉన్నారు. శనివారం గర్హీదుపట్టాకు చేరుకొని రాత్రంతా అక్కడే ఉన్నారు. ప్రస్తుతం ముజఫరాబాద్‌- శ్రీనగర్‌ హైవే మీదుగా వారు నియంత్రణ రేఖ వద్దకు వస్తున్నారు. జమ్ముకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (జేకేఎల్‌ఎఫ్‌) వీరికి నేతృత్వం వహిస్తోంది. భారత్‌, పాకిస్థాన్‌కు సంబంధించిన ఐరాస మిటలరీ పరిశీలకుల బృందాలు తమను సంప్రదించాయని స్థానిక జేకేఎల్‌ఎఫ్‌ నాయకుడు ఒకరు చెప్పారు. శాంతియుతంగా నిరసన తెలిపేవారిపై చర్యలు తీసుకోవద్దని ఐరాస రెండు దేశాలను కోరిందని అన్నారు. తాము కచ్చితంగా నియంత్రణ రేఖను దాటుతామని ఆ నాయకుడు అన్నారు. భారత సైన్యం ఇప్పటికే అత్యంత నిఘా పెట్టి ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తోంది.