Dog Blessing Devotees: సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ఎక్కడ ఏది జరిగినా వెంటనే వైరల్‌గా మారుతోంది. దేశంలో.. ఆ మాటకొస్తే ప్రపంచంలో ఏ మూలన ఏ వింత సంఘటన జరిగినా స్మార్ట్ ఫోన్‌లో ప్రత్యక్షమవుతోంది. ప్రతి రోజూ ఇలా ఎన్నో వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే ఇంటర్నెట్ వేదికగా వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రాలోని సిద్ధటెక్ పట్టణంలో ఉన్న సిద్ధి వినాయక ఆలయానికి వస్తోన్న భక్తులకు అక్కడ ఉన్న ఓ శునకం షేక్ హ్యాండ్ ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గుడి బయట నిల్చున్న శునకం.. దేవుడిని దర్శనం చేసుకుని భక్తులు బయటకు రాగానే చేతులో చేయి వేస్తూ ఆశీర్వదించినట్లు చేస్తోంది. శునకం చేస్తోన్న ఈ పనిని తన మొబైల్ కెమెరాలో బంధించిన అరుణ్ లిమాడియా అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరి ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి…