రాముడు జన్మించింది ఎప్పుడో తెలుసా..?

| Edited By:

Nov 10, 2019 | 8:39 AM

ప్రస్తుతం హాట్ టాపిక్ అయోధ్య కేసు. ముందు నుంచే.. తీర్పు ఏదైనా సరే.. దాన్ని అందరూ స్వాగతించాలని.. ప్రధాని మోదీ దగ్గరి నుంచి అధికారులందరూ.. ప్రజలను అప్రమత్తం చేస్తూ వచ్చారు. ఇందులో భాగంగా.. శనివారం.. ఎంతో చారిత్రాత్మకమైన.. సంచలనాత్మకమైన తీర్పును వెల్లడించారు జస్టిస్ రంజన్ గొగొయ్. దాదాపు అరగంట సేపు ఆ తీర్పును చదివి వినిపించారు. పురావస్తు శాఖల ఆధారంగా.. అయోధ్య.. రాముడిదేనని.. అక్కడే ఆయన జన్మించాడని.. సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా.. 2.77 ఎకరాల్లో.. ఒక భాగంగా […]

రాముడు జన్మించింది ఎప్పుడో తెలుసా..?
Follow us on

ప్రస్తుతం హాట్ టాపిక్ అయోధ్య కేసు. ముందు నుంచే.. తీర్పు ఏదైనా సరే.. దాన్ని అందరూ స్వాగతించాలని.. ప్రధాని మోదీ దగ్గరి నుంచి అధికారులందరూ.. ప్రజలను అప్రమత్తం చేస్తూ వచ్చారు. ఇందులో భాగంగా.. శనివారం.. ఎంతో చారిత్రాత్మకమైన.. సంచలనాత్మకమైన తీర్పును వెల్లడించారు జస్టిస్ రంజన్ గొగొయ్. దాదాపు అరగంట సేపు ఆ తీర్పును చదివి వినిపించారు.

పురావస్తు శాఖల ఆధారంగా.. అయోధ్య.. రాముడిదేనని.. అక్కడే ఆయన జన్మించాడని.. సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా.. 2.77 ఎకరాల్లో.. ఒక భాగంగా ఉన్న బాబ్రీ మసీదును కూడా కూల్చివేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. అలాగే.. ఈ తీర్పును.. ముస్లిం పెద్దలు కూడా స్వీకరించారు. దాదాపు 40 రోజులు వాదనలు విన్న సుప్రీం.. నవంబర్ 9న సంచలనాత్మకమైన తీర్పును ప్రకటించింది.

అయితే.. ఇప్పుడు అందరూ.. నిజంగా అక్కడ రాముడు జన్మించాడా..? అంటూ కొన్ని ప్రశ్నలు వారిలో మెదులుతున్నాయి. ఇందుకు ఆధారాలు కూడా సంపాదించారు పురావస్తు శాఖ అధికారులు. రామాయణం నిజంగా జరిగిందని.. రాముడు జన్మించాడని.. ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ పరిశోధకులు వెల్లడించారు. కాగా.. ‘రాముడు జన్మించినప్పుడు ఐదు గ్రహాలు ఉచ్ఛదశలో ఉన్నాయని.. రాముడు వనవాసానికి వెళ్లేటప్పుడు వయసు 25అని వాల్మీకీ రామాయణంలో’ తెలిపారు. దీని ఆధారంగా రీసెర్చ్ మొదలు పెట్టారు పలువురు నిపుణులు.

దీంతో.. ప్లానిటోరియం అనే సాఫ్ట్‌వేర్‌తో ఖచ్చితంగా కాల నిర్థారణ చేసి.. రాముడు ఎప్పుడు జన్మించాడనేది.. సంవత్సరం, సమయం, కాలంతో సహా చెప్పారు. క్రీస్తు పూర్వం 5114లో జనవరి 10న అర్థరాత్రి 12.05 గంటలకు రాముడు జన్మించాడని నిర్థారించారు శాస్త్రవేత్తలు. ఏదేమైనా.. ఇప్పుడు మరో కొత్త విషయం తెలిసిందనే చెప్పాలి. మొత్తానికి అయోధ్య రాముడిది అయింది.