AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెర్రీ సలహా.. ఎన్టీఆర్ సొంత గ్యారేజ్..?

టాలీవుడ్‌ స్టార్ హీరోలు ఇప్పుడు తమ పంథాను మారుస్తున్నారు. తమ వలన మిగిలిన వాళ్లకు నష్టాలెందుకు అనుకుంటున్నారో..? లేకపోతే లాభాలను వెనకేసుకోవాలనుకుంటున్నారో..? తెలీదు గానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ లిస్ట్‌లో ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, కల్యాణ్ రామ్, నాని, విజయ్ దేవరకొండలు చేరగా.. తాజాగా ఎన్టీఆర్ కూడా చేరబోతున్నట్లు తెలుస్తోంది. అవును త్వరలోనే ఎన్టీఆర్ సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ను నిర్మించాలనుకుంటున్నాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్‌ఆర్’ మూవీ షూటింగ్‌లో […]

చెర్రీ సలహా.. ఎన్టీఆర్ సొంత గ్యారేజ్..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 10, 2019 | 8:56 AM

Share

టాలీవుడ్‌ స్టార్ హీరోలు ఇప్పుడు తమ పంథాను మారుస్తున్నారు. తమ వలన మిగిలిన వాళ్లకు నష్టాలెందుకు అనుకుంటున్నారో..? లేకపోతే లాభాలను వెనకేసుకోవాలనుకుంటున్నారో..? తెలీదు గానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ లిస్ట్‌లో ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, కల్యాణ్ రామ్, నాని, విజయ్ దేవరకొండలు చేరగా.. తాజాగా ఎన్టీఆర్ కూడా చేరబోతున్నట్లు తెలుస్తోంది. అవును త్వరలోనే ఎన్టీఆర్ సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ను నిర్మించాలనుకుంటున్నాడట.

ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్‌ఆర్’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ ప్రాజెక్ట్‌ తరువాత సొంత ప్రొడక్షన్‌పై ఆయన ఓ ప్రకటన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి తన తండ్రి, కుమారుడు పేర్లు కలిసివచ్చేలా ఓ పేరు పెట్టాలని సన్నిహితుల దగ్గర చెప్పినట్లు కూడా టాక్. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్‌కు చెర్రీ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్ హౌస్‌ను నిర్మించి.. తన తండ్రితో వరుస సినిమాలను తీస్తున్నాడు. త్వరలో యంగ్ హీరోలతో సినిమాలను నిర్మించేందుకు కూడా రెడీగా ఉన్నాడు. ఈ క్రమంలో సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంటేనే మంచిదని చెర్రీ, తారక్‌కు చెప్పినట్లు టాక్. అందుకే ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Follow Us
కుటుంబంలో ఒకటిగా ఉన్న గోమాత.. తెల్లారేసరికల్లా విగతజీవిగా..!
కుటుంబంలో ఒకటిగా ఉన్న గోమాత.. తెల్లారేసరికల్లా విగతజీవిగా..!
ఇళ్లకు PNGని అందించడానికి ఎంత ఖర్చవుతుంది.. ఒక కనెక్షన్ ధర ఎంత?
ఇళ్లకు PNGని అందించడానికి ఎంత ఖర్చవుతుంది.. ఒక కనెక్షన్ ధర ఎంత?
తలకాయ కూర ఇలా వండితే టాప్ లేచిపోద్ది...
తలకాయ కూర ఇలా వండితే టాప్ లేచిపోద్ది...
రూ. 11.75 కోట్ల జీతం.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లో ఒక్క సిక్స్ కొట్టలే
రూ. 11.75 కోట్ల జీతం.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లో ఒక్క సిక్స్ కొట్టలే
గిరిజన నేత, ఎంబ్రాయిడరీ, చేతివృత్తులకు కేంద్రం గుడ్‌న్యూస్!
గిరిజన నేత, ఎంబ్రాయిడరీ, చేతివృత్తులకు కేంద్రం గుడ్‌న్యూస్!
ఉగాది స్పెషల్: ఈ చిన్న పనులు చేస్తే మీ అదృష్టం మారిపోతుంది!
ఉగాది స్పెషల్: ఈ చిన్న పనులు చేస్తే మీ అదృష్టం మారిపోతుంది!
హైదరాబాద్‌కు బ్రిటన్‌ పాఠశాలలు.. మార్గం సుగమం..!
హైదరాబాద్‌కు బ్రిటన్‌ పాఠశాలలు.. మార్గం సుగమం..!
ఓటీటీలో టాప్ ట్రెండింగ్.. ఆ సినిమాపై ప్రశంసలు కురిపించిన నాగ్
ఓటీటీలో టాప్ ట్రెండింగ్.. ఆ సినిమాపై ప్రశంసలు కురిపించిన నాగ్
భారత్–వియత్నాం మంత్రుల భేటీ: గిరిజన అభివృద్ధికి కొత్త దిశ
భారత్–వియత్నాం మంత్రుల భేటీ: గిరిజన అభివృద్ధికి కొత్త దిశ
BMW నుంచి సరికొత్త బైక్‌.. ధర రూ.33.50 లక్షలు.. స్పెషాలిటీ ఏంటి?
BMW నుంచి సరికొత్త బైక్‌.. ధర రూ.33.50 లక్షలు.. స్పెషాలిటీ ఏంటి?