బ్రేకింగ్: కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు బెయిల్
మనీలాండరింగ్ కేసులో అరెస్టైన కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ హైకోర్టు రూ.25 లక్షల పూచీకత్తుతో శివకుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని శివకుమార్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో సెప్టెంబర్ 3న డీకే శివకుమార్ ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. గతంలో అనేక మార్లు అయన బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లు […]

మనీలాండరింగ్ కేసులో అరెస్టైన కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ హైకోర్టు రూ.25 లక్షల పూచీకత్తుతో శివకుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని శివకుమార్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో సెప్టెంబర్ 3న డీకే శివకుమార్ ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.
గతంలో అనేక మార్లు అయన బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లు కోర్టు కొట్టేసింది. తాజాగా మరోసారి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా.. విచారించిన కోర్టు ఆయనకు బెయిల్‌ను మంజూరు చేసింది. దాదాపు 50 రోజుల వరకు శివకుమార్ జైల్లోనే ఉన్నారు.