తేళ్లు, బొద్దింకలు తిన్నా.. తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

26  February 2025

Basha Shek

డాక్టర్ అవ్వబోయి యాక్టర్లు అయిన హీరో, హీరోయిన్లు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అందులో ఈ బ్యూటీ ఒకరు.

చైనాలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి అపోలో ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేసిందీ తెలుగమ్మాయి. ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టింది.

ఇక కొన్నాళ్ల తర్వాత ఈ నటి వైద్యవృత్తిని పూర్తిగా వదిలేసి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అయితే ఆమె డాక్టర్ గా ఆరేళ్ల పాటు చైనాలోనే ఉందట

ఈ క్రమంలోనే చైనాలో తన లైఫ్ స్టైల్ గురించి, తన ఆహార అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుందీ అందాల తార

 ఈ సందర్భంగానే బొద్దింకలు, తేళ్లు వంటివి రుచి చూశానంటోందీ ముద్దుగుమ్మ. ఆ బ్యూటీ మరెవరో కాదు పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల.

చైనీయుల ఫుడ్‌ రుచి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఒకటి రెండు సార్లు  బొద్దింకలు, తేళ్ల కు సంబంధించిన ఫుడ్‌ తిన్నాను' అని అంటోంది కామాక్షి

కొన్నేళ్ల క్రితం చైనాలో మనలాగా గ్రీనరీ ఉండేది కాదనీ.. అందుకే ఇలా కనిపించిన జీవుల్ని చంపి తినడం అలవాటైందని మీనాక్షి చెప్పుకొచ్చింది.

పొలిమేర,  పొలిమేర 2, మారేడుమిల్లి ప్రజానీకం తదితర సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది కామాక్షి భాస్కర్ల