దిశ నిందితుల డెడ్‌బాడీస్‌కు ప్రారంభమైన రీ-పోస్టుమార్టం

| Edited By:

Dec 23, 2019 | 12:29 PM

దిశ కేసు నిందితులకు రీ పోస్టుమార్టం ప్రారంభమైంది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన ముగ్గురు వైద్యులు.. రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఉదయం 9.00 గంటల తర్వాత ఈ పోస్ట్ మార్టం ప్రారంభమైంది. ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా ఈ బ‌ృందానికి లీడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ బృందంలో డాక్టర్ ఆదర్శ్ కుమార్, డాక్టర్ అభిషేక్ యాదవ్ సభ్యులుగా ఉన్నారు. ఇక హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇవాళ సాయంత్రం 5 గంటలలోగా రీ-పోస్టుమార్టం ముగించి, […]

దిశ నిందితుల డెడ్‌బాడీస్‌కు ప్రారంభమైన రీ-పోస్టుమార్టం
Follow us on

దిశ కేసు నిందితులకు రీ పోస్టుమార్టం ప్రారంభమైంది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన ముగ్గురు వైద్యులు.. రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఉదయం 9.00 గంటల తర్వాత ఈ పోస్ట్ మార్టం ప్రారంభమైంది. ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా ఈ బ‌ృందానికి లీడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ బృందంలో డాక్టర్ ఆదర్శ్ కుమార్, డాక్టర్ అభిషేక్ యాదవ్ సభ్యులుగా ఉన్నారు.

ఇక హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇవాళ సాయంత్రం 5 గంటలలోగా రీ-పోస్టుమార్టం ముగించి, నివేదిక సమర్పించనున్నారు. నిందితుల మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయే స్థితిలో ఉన్నాయని, అప్పటికే 50 శాతం మేర డ్యామేజ్ అయినట్టు ఇటీవలే గాంధీ వైద్యులు హైకోర్టుకు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా దిశ కేసు నిందితుల డెడ్‌బాడీస్.. కుటుంబ సభ్యులకు అప్పగింతపై తుది నిర్ణయాన్ని సుప్రీంకోర్టు.. హైకోర్టుకు వదిలేసింది. ఈ నేపథ్యంలో రీ పోస్టుమార్టం నివేదిక అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.