Disaster movies of 2020: ఈ ఏడాది అత్యంత నిరాశ‌ ప‌ర్చిన‌ డిజాస్టర్ సినిమాలు ఏంటో తెలుసా..?

|

Dec 29, 2020 | 4:53 PM

ఈ ఏడాది క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా అన్ని రంగాల్లో తీవ్ర‌మైన న‌ష్టం చ‌విచూడాల్సి వ‌చ్చింది. సినీ ఇండ‌స్ట్రీని సైతం తీవ్ర‌మైన దెబ్బ కొట్టింది. ఓటీటీ ఉండ‌టంతో...

Disaster movies of 2020: ఈ ఏడాది అత్యంత నిరాశ‌ ప‌ర్చిన‌ డిజాస్టర్ సినిమాలు ఏంటో తెలుసా..?
Follow us on

ఈ ఏడాది క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా అన్ని రంగాల్లో తీవ్ర‌మైన న‌ష్టం చ‌విచూడాల్సి వ‌చ్చింది. సినీ ఇండ‌స్ట్రీని సైతం తీవ్ర‌మైన దెబ్బ కొట్టింది. ఓటీటీ ఉండ‌టంతో ఈ ఏడాది చాలా సినిమాలు వ‌చ్చాయి. అంందులో కొ న్నిసినిమాలు మాత్రం దారుణంగా నిరాశ ప‌ర్చాయి. అంచ‌నాల‌కు అందుకోవ‌డంతో విఫ‌ల‌మ‌య్యాయి. అలాగే ఈ ఏడాది విడుద‌లైన సినిమాలు త‌క్కువే. ప్ర‌తిసారి దాదాపు 200 సినిమాలు విడుద‌లైతే ఈ సారి మాత్రం ఆ సంఖ్య 70లోపే ఉంది. అందులో అల వైకుంఠ‌పుర‌ములో, స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి ఒక‌టి రెండు సినిమాలు మిన‌హాయిస్తే చాలా సినిమాలు ప్లాన్ అయ్యాయి. మ‌రి 2020లో నిరాశ ప‌ర్చిన సినిమాలేంటో చూద్దాం.

1. ఎంత మంచివ‌డ‌వురా:

క‌ళ్యాణ్ రామ్ హీరోగా స‌తీష్ వేగేశ్న తెర‌కెక్కించిన చిత్రం ఎంత మంచివడవురా. శ‌త‌మానం భ‌వ‌తితో నేష‌న‌ల్ అవార్డ్ సొంతం చేసుకున్న ఆయ‌న ఆ త‌ర్వాత శ్రీ‌నివాస క‌ళ్యాణంతో ఆక‌ట్టుకోలేక‌పోయారు. అయితే సంక్రాంతికి ఎంత మంచివాడ‌వురా అంటూ మ‌ళ్లీ మంచి మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చినా ప్ర‌జ‌లు పెద్ద‌గా ఆద‌రించ‌లేదు. ఈ చిత్రం ఫుల్ ర‌న్ 7 కోట్ల‌లోపే పూర్త‌యిపోయింది.

2. డిస్కో రాజా:

ర‌వితేజ హీరోగా, ఆనంద్ తెర‌కెక్కించిన ఈ సైన్స్ ఫిక్ష‌న్ క‌థ ఆధారంగా బాగానే ఉన్నా.. క‌థ మామూలుగా ఉండ‌టంతో మ‌రోసారి ర‌వితేజ‌కు నిరాశ ఎదురైంది. ఈ సినిమా ఫుల్ ర‌న్ క‌నీసం 8 కోట్ల షేర్‌ కూడా తీసుకురాలేకపోయింది.

3. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌:

పేరుకు త‌గ్గ‌ట్టుగానే వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ లవర్. డిజాస్ట‌ర్ అయిపోయింది ఈ సినిమా. డియ‌ర్ కామ్రేడ్ ప్లాప్ త‌ర్వాత ఏడాది గ్యాప్ త‌ర్వాత వ‌చ్చిన ఈ సినిమా విజ‌య దేవ‌ర‌కొండ‌కు నిరాశ ప‌ర్చింది. క్రాంతి మాధ‌వ్ తెర‌కెక్కించిన చిత్రం ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. క‌నీసం రూ. 10 కోట్లు కూడా వ‌సూలు చేయ‌లేక‌పోయింది.

4. పెంగ్విన్ :

కీర్తి సురేష్ హీరోయిన్‌గా కార్తిక్ సుబ్బారాజ్ నిర్మాత‌గా మారి ఈశ్వ‌ర్ కార్తిక్ తెర‌కెక్కించిన సినిమా పెంగ్విన్‌. ట్రైల‌ర్‌తోనే మంచి ఆస‌క్తి పెంచినా.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా విడుద‌లై క‌నీస స్పంద‌న కూడా రాలేక‌పోయింది. ఈ టైటిల్ కూడా ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది.

5. ఒరేయ్ బుజ్జిగా :

రాజ్ త‌రుణ్ హీరోగా విజ‌య్ కుమార్ కొండా తెర‌కెక్కించిన చిత్రం ఇది. ఈ ఏడాది ఈ సినిమా కూడా నిరాశే ప‌ర్చింది. ఆహాలో విడుద‌లైన ఈ సినిమాకు ఊహించినంత ఆద‌ర‌ణ రాలేక‌పోయింది.

6. నిశ్శ‌బ్ధం:

అనుష్క శెట్టి హీరోయిన్‌గా వ‌చ్చిన ఈ సినిమా కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. టైటిల్ త‌గ్గ‌ట్లుగానే ఎంత నిశ్శ‌బ్ధం వ‌చ్చింది.. అంతే నిశ్శ‌బ్ధంగా వెళ్లిపోయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అయిన ఈ సినిమా తీవ్ర న‌ష్టాన్ని తెచ్చిపెట్టింది.

7. జాను :

శ‌ర్వానంద్‌, స‌మంత అక్కినేని జంట‌గా త‌మిళ క్లాసిక్ 96 రీమేక్‌గా వ‌చ్చిన సినిమా జాను. ఈ సినిమాను ఒరిజిన‌ల్ తెర‌కెక్కించిన ప్రేమ్ కుమార్ ఇక్క‌డ కూడా తెర‌కెక్కించాడు. కానీ ఈ మూవీ తెలుగులో మాత్రం నిరాశ ప‌ర్చింది.

8. వి :

ఒక వేళ ఈ సినిమా థియేట‌ర్‌లో విడుద‌లై ఉంటే ఈ ఏడాది మోస్ట్ టాప్ డిజాస్ట‌ర్స్‌లో వి సినిమా కూడా ఉండేదేమో. నాని 25వ సినిమాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌లైంది. దిల్ రాజు నిర్మాత వ‌హించిన ఈ సినిమా.. పెద్దగా రాణించ‌లేక‌పోయింది. ఈ ఏడాది తీవ్ర నిరాశ ప‌ర్చింద‌నే చెప్పాలి.

9. మా వింత గాధ వినుమా :

కృష్ణ అండ్ హిజ్ లీల అంటూ ఓటీటీలో సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ‌ సంద‌డి చేశాడు. ఈ సినిమాకు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. అయితే అదే ఊపులో సిద్దు నుంచి వ‌చ్చిన మా వింత గాథ వినుమా మాత్రం అత్యంత నిరాశ ప‌ర్చింది.