వెలగపూడిలో కొనసాగుతున్న ఇరువర్గాల ఆందోళనలు.. ఎంపీ సురేష్, ఎమ్మెల్యే శ్రీదేవి రాజీనామాకు డిమాండ్

|

Dec 28, 2020 | 11:45 AM

తుళ్ళూరు మండలం వెలగపూడిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. రోడ్డు ఆర్చి విషయంలో తలెత్తిన వివాదంతో రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. న్యాయం చేయాలంటూ రెండు వర్గాల జనం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు

వెలగపూడిలో కొనసాగుతున్న ఇరువర్గాల ఆందోళనలు..  ఎంపీ సురేష్, ఎమ్మెల్యే శ్రీదేవి రాజీనామాకు డిమాండ్
Follow us on

తుళ్ళూరు మండలం వెలగపూడిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. రోడ్డు ఆర్చి విషయంలో తలెత్తిన వివాదంతో రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరువర్గాలు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. మరో 30 మందికి గాయాలయ్యాయి. పోలీసుల వల్లే మరియమ్మ చనిపోయిందంటూ ఓ వర్గం ఆందోళనకు దిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. న్యాయం చేయాలంటూ రెండు వర్గాల జనం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు

అయితే, ఎంపి నందిగం సురేష్, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వెనకుండి దాడి చేయిస్తున్నారని ఓ సామాజిక వర్గం ఆరోపిస్తోంది. ఎంపి,ఎమ్మెల్యేలకు ఎలాంటి సంబంధం లేదని రోడ్డు ఆర్చి విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తిందని చెబుతోంది మరో వర్గం. ఇంతకీ ఈ గొడవకు అసలు కారణంపై స్పష్టత రాలేదు. కాగా, వెలగపూడి లో అంబేద్కర్ విగ్రహాం వద్దకు చేరుకున్న ఆందోళనకారులు ధర్నాకు దిగారు. మరియమ్మ మృతదేహంతో నిరసన చేపట్టారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎంపీ పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ సురేష్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని నిరసనకారులు బీష్మించి కూర్చున్నారు.

కాగా, ఇరువర్గాలను సర్ధి చెప్పేందుకు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ  నందిగం సురేష్ వెలగపూడి గ్రామానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో సమావేశమైన చర్చిస్తున్నారు.