ఆ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకోవద్దు.. వేధింపులకు గురి చేస్తే ఫిర్యాదు చేయండిః డీజీపీ

|

Dec 18, 2020 | 8:46 PM

ఆర్థిక ఇబ్బందులను అధగమించేందుకు యువత యాప్‌ రుణాలకు అలవాటుపడింది. రుణాలు తీర్చాలంటూ చేస్తున్న వేధింపులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పుతున్నారు. వరుసగా తెలంగాణలో ముగ్గురు ప్రాణాలు బలితీసుకున్నారు. దీంతో తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తమైంది.

ఆ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకోవద్దు.. వేధింపులకు గురి చేస్తే ఫిర్యాదు చేయండిః డీజీపీ
Follow us on

ఆర్థిక ఇబ్బందులను అధగమించేందుకు యువత యాప్‌ రుణాలకు అలవాటుపడింది. రుణాలు తీర్చాలంటూ చేస్తున్న వేధింపులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పుతున్నారు. వరుసగా తెలంగాణలో ముగ్గురు ప్రాణాలు బలితీసుకున్నారు. దీంతో తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. చట్టబద్ధత లేని యాప్‌ల ద్వారా రుణాలు తీసుకోవద్దని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. చలామణిలో ఉన్న యాప్‌లలో అధికశాతం ఆర్బీఐలో నమోదు కాలేదన్నారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో రుణాలు అందించే యాప్స్‌కు ఆర్బీఐ రూల్స్‌ ఖచ్చితంగా వర్తిస్తాయని తెలిపారు. ఇలాంటి యాప్‌లలో చాలా వరకు చైనాకు చెందినవే ఉన్నాయని వెల్లడించారు. వేధింపులకు పాల్పడే యాప్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యాప్‌ల ద్వారా అనేక మందికి నగదు రుణాలు అందించి వాటిని తిరిగి చెల్లించే క్రమంలో వేధింపులకు గురవుతున్నారు. ఒత్తిడలు భరించలేక పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీ ఒక ప్రకటన విడదల చేశారు. ఆర్‌బీఐ చట్టం 1934లోని సెక్షన్ 45-1ఏ ప్రకారం ఏదైన నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు తగిన రిజిస్ట్రేషన్ అనంతరమే నిబంధనల మేరకు పనిచేయడానికి అనుమతి ఉందని డీజీపీ పేర్కొన్నారు. ఆర్‌బీఐ చట్టానికి లోబడి రిజిస్టర్ కాని ఏ నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు చట్టబద్దత లేదని ఆయన స్పష్టం చేశారు.

ఫోన్ ద్వారానే వ్యక్తిగత డేటాను యాప్ ల నిర్వాహకులు సేకరిస్తారని, ఈ యాప్‌ల యూజర్లు వ్యక్తిగత సున్నిత అంశాలను తమకు తెలియకుండానే అందిస్తారని డీజీపీ తెలిపారు. ముఖ్యంగా మీ వ్యక్తిగత వివరాలు, ఆధార్, బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లో అందజేయవద్దని తెలిపారు. ఇంటర్ నెట్ లో లభించే అనేక రుణాలు అందించే యాప్‌లు మోసపూరితమైనవని ఆయన తెలిపారు.