రాజధాని వస్తుందంటే విశాఖ ప్రజలు అలా చేస్తున్నారట!

|

Jan 29, 2020 | 7:06 PM

ఏపీకి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ మారబోతోందన్న సంతోషం కంటే ఉక్కు నగర వాసులకు వేరే భయం పట్టుకుందంటున్నారు తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు. మూడు రాజధానులపై నివేదిక ఇచ్చిన జీఎన్ రావుపై ప్రశ్నల వర్షం సంధించిన దేవినేని ఉమ… విశాఖవాసుల్లో ఏర్పడిన కొత్త భయం ఇదేనంటూ తనదైన శైలిలో ఓ కొత్త విషయాన్ని వెల్లడించారు. విశాఖ నగరానికి తుఫానుల ముప్పువుందని పేర్కొన్న జీఎన్ రావు కమిటీ ఆ నగరం రాజధానిగా పనికి రాదన్న […]

రాజధాని వస్తుందంటే విశాఖ ప్రజలు అలా చేస్తున్నారట!
Follow us on

ఏపీకి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ మారబోతోందన్న సంతోషం కంటే ఉక్కు నగర వాసులకు వేరే భయం పట్టుకుందంటున్నారు తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు. మూడు రాజధానులపై నివేదిక ఇచ్చిన జీఎన్ రావుపై ప్రశ్నల వర్షం సంధించిన దేవినేని ఉమ… విశాఖవాసుల్లో ఏర్పడిన కొత్త భయం ఇదేనంటూ తనదైన శైలిలో ఓ కొత్త విషయాన్ని వెల్లడించారు.

విశాఖ నగరానికి తుఫానుల ముప్పువుందని పేర్కొన్న జీఎన్ రావు కమిటీ ఆ నగరం రాజధానిగా పనికి రాదన్న నివేదిక ఇచ్చిందంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు ఏపీలో పెద్ద దుమారాన్నే రేపాయి. దానిపై జీఎన్ రావు స్వయంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసీ మరీ క్లారిఫికేషన్ ఇచ్చారు.

అయితే, జీఎన్ రావు ఇచ్చిన వివరణపై తెలుగుదేశం పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రత్యేకించి దేవినేని ఉమ.. జీఎన్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘జీఎన్ రావుకు వంద మీటర్లు నడిస్తే…రెండు రోజులు విశ్రాంతి అవసరం.. అలాంటి జీఎన్ రావు రాష్ట్రం అంతా ఎలా తిరిగారు’’ అని నిలదీశారు దేవినేని ఉమ. జీఎన్ రావు కమిటీ రిపోర్టుపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదే క్రమంలో ఉమ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలోని దస్‌పల్లా, వాల్తేరు క్లబ్ భూములను కొట్టేయడానికి విజయసాయి ప్లాన్ చేశారని దేవినేని ఉమ ఆరోపించారు. విశాఖనగరంలో సామాన్యులు భయడుతున్నారని, తమ భూములు కబ్జాకు గురి కాకుండా ఖాళీ స్థలాలకు కాంపౌండ్ వాల్స్ కట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ నగరవాసులకు ఇప్పుడు కబ్జాల భయం పట్టుకుందంటున్నారు ఉమ.